రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఇవాళ్టితో ముగియనుంది.. దీంతో ఈరోజు అర్ధరాత్రికి దేశ రాజధాని ఢిల్లీ చేరుకోనున్నారు ఏపీ సీఎం.. అయితే, రేపు ఢిల్లీలో ఏపీ సీఎం కీలక సమావేశాలు ఉన్నాయి.. రేపు ఉదయం 10 .30 కు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం కానున్నారు.. మధ్యామ్నం 12.30 కు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వల్‌తో భేటీ ఉండగా.. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం ఫిక్స్ చేశారు.. ఏపీ నుండి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై అమిత్ షాతో చర్చించబోతున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కాగా.. రేపు ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణ.. ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనుంది.. గతంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ముగ్గురు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలు చేయగా.. రెండు స్థానాలను టీడీపీ తీసుకోగా మరో స్థానం బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం దక్కింది.. అయితే, సంఖ్యా బలం రీత్యా కూటమికి దక్కనున్నాయి ఖాళీ అయిన రాజ్యసభ స్థానం.. ఖాళీ అయిన రాజ్యసభ అభ్యర్థిపై ఇప్పటికే ప్రచారంలో పలు పేర్లు వినిపిస్తుండగా.. బీజేపీ కోటాలో ఎవరికి ఇస్తారనే దానిపై హాట్ హాట్ చర్చ సాగుతోంది.. ఈ సమయంలో అమిత్‌షాతో చంద్రబాబు భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది..
కూటమిలో ప్రతి చర్యతో జగన్‌కు జ్ఞానోదయం కలగాలి..!
కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న ప్రతి చర్యతో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు జ్ఞానోదయం కలగాలని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. పార్వతిపురం మన్యం జిల్లాలో అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖలో మేయర్ గా కుటమి అభ్యర్థి విజయం సాధించారు.. జగన్మోహన్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని విమర్శించడం దారుణం అన్నారు.. గతంలో స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల నామినేషన్ల ప్రక్రియలోనే ఆగిపోయే విధంగా తప్పులు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ విధంగా స్థానిక ఎన్నికల్లో గెలిచిన వైసీపీ.. సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిందన్నారు.. కూటమిలో ప్రతి చర్యక జగన్ కు జ్ఞానోదయం కలగాలని వ్యాఖ్యానించారు..
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. గ్రౌండ్‌లోనే మరో యువకుడు మృతి
పల్నాడు జిల్లా వినుకొండలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురైన గౌస్ బాషా అనే యువకుడు కుప్పకూలిపోయాడు.. అయితే, వెంటనే ఆస్పమత్తమైన తోటి క్రికెటర్లు.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు గౌస్ భాష.. క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగింది.. మృతుడు గౌస్ బాషాకు మూడేళ్లక్రితమే వివాహం కావడంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. గౌస్ బాషా మృతితో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు..
మారిన పోలవరం డెడ్‌లైన్.. ఆరు నెలల ముందే పూర్తి..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం డెడ్‌లైన్ మారిపోయింది.. మరో ఆరు నెలల ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 2027 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటున్నామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. అయితే, 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా ప్రకటించారని అన్నారు. రాజమండ్రిలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ నిన్నటికి 202 మీటర్లు పూర్తి అయ్యిందని ప్రకటించారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేస్తామని అన్నారు. 990 కోట్ల రూపాయలతో డయాఫ్రం వాల్ నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు.
తిరుమలకు సొంత కార్లలో వెళ్తున్నారా..? అయితే, ఇది మీ కోసమే..
తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇవాళ ( ఏప్రిల్ 21న) కీలక సూచనలు చేశారు. వేసవి దృష్ట్యా కార్లు దగ్ధం అవుతున్న ఘటనలు తిరుమల ఘాట్ రోడ్డులో పెరిగిపోతున్నాయి. దీంతో వాహనాలు నడిపేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు జారీ చేశారు. వీటిని తిరుమలకు సొంత కార్లలో వచ్చే భక్తులు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కాగా, ఇటీవల వేసవి కాలంలో తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదని పోలీసులు తెలిపారు. అయితే, రెండు కార్లు పూర్తిగా కాలిపోయినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా కార్లు దగ్ధమవడానికి కారణాలు ఏమిటి అని నిపుణులను సంప్రదిస్తే పలు కారణాలు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. కాబట్టి తమ సూచనలు తప్పనిసరిగా వాహన చోదకులు పాటించాలన్నారు.
పోలీసులు లగచర్ల రైతులను కొట్టి, శారీరకంగా హింసించారు
లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సంచలన విషయాలు బయట పెట్టింది. పోలీసులు లగచర్ల రైతులను కొట్టి, శారీరకంగా హింసించారని NHRC దర్యాప్తు బృందం నిర్ధారించింది. 2024 నవంబర్‌లో ఫార్మా సిటీ కోసం భూసేకరణపై ప్రజా విచారణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు వచ్చినప్పుడు నిరసన తెలిపినందుకు.. అధికారులపై దాడి చేశారని కేసు నమోదు చేసి పరిగి పోలీస్ స్టేషన్‌లో లగచర్ల నివాసితులలో కొంతమంది రైతులను పోలీసులు అరెస్టు చేసి, శారీరకంగా హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దర్యాప్తు బృందం వెల్లడించింది. నిరసన జరిగినప్పుడు సంఘటన స్థలంలో లేని అనేక మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు, ఇంట్లో ఉన్న మహిళలను పోలీసులు వేధింపులకు గురిచేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. రాత్రిపూట అరెస్టు చేయబడిన గ్రామస్థులను పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టి, హింసించి.. మేజిస్ట్రేట్ ముందు హింస గురించి చెప్పొద్దని బెదిరించారని రిపోర్ట్ లో తేల్చి చెప్పింది.
పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత ఏం జరగనుంది.. ఎక్కడ ఖననం చేస్తారంటే..?
రోమన్ కాథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఇవాళ (ఏప్రిల్ 21న) తుదిశ్యాస విడిచారు. అయితే, సాధారణంగా పోప్ అంత్యక్రియలను సంప్రదాయబద్దంగా జరుగుతాయి. కానీ, చాలా క్లిష్టమైన ఆ పద్దతిలో మార్పులు చేయాలని ఇటీవల దివంగత పోప్ ఫ్రాన్సిస్ సూచించారు. దీని కోసం ఆయన కొన్ని ప్లాన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో పోప్‌లకు మూడు అంచెలున్న శవపేటికల్లో ఖననం చేసే ఆచారం ఉండేది. సైప్రస్ చెట్టు, సీసం, సింధూర వృక్షంతో తయారు చేసిన శవపేటికలో పోప్ పార్థివదేహాన్ని తరలించేందుకు ఉపయోగించేవారు. కాగా, అలాంటి శవపేటికలకు స్వప్తి చెప్పారు పోప్ ఫ్రాన్సిస్. చాలా సింపుల్‌గా ఉండే.. చెక్క శవపేటికలో తన పార్థివదేహాన్ని ఉంచాలని ఇటీవల ఆయన కోరారు. కాగా, ఫ్రాన్సిస్ కోసం ఇప్పుడు జింక్ ఖనిజ పట్టీతో ఆ శవపేటికను సిద్ధం చేయనున్నారు.
రాత పరీక్ష లేకుండానే ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్.. 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ రెడీ
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పోటీపరీక్షల్లో ప్రతిభ చూపాలి. తర్వాత ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలి. ప్రతి దశలో ప్రతిభ చూపితే తప్పా జాబ్ సాధించలేరు. కానీ, మీకు ఇప్పుడు రాత పరీక్ష లేకుండానే జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL), వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో మెకానికల్ 150, కెమికల్ 60, ఎలక్ట్రికల్ 80, ఎలక్ట్రానిక్స్ 45, ఇన్ స్ట్రుమెంటేషన్ 45, సివిల్ 45 పోస్టులున్నాయి.
ఆ పోస్టుకు లైక్ కొట్టిన సమంత.. మళ్లీ మొదలైన రచ్చ
స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా సరే దాని చుట్టూ ఏదో ఒక రచ్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, చేసే కామెంట్లు పెద్ద చర్చకు దారి తీస్తాయి. ఏం చేసినా.. చివరకు ఆమె విడాకుల గురించే కావచ్చేమో అనే ప్రశ్నలు కామన్. ఇప్పుడు ఆమె కొట్టిన ఒక లైక్ కూడా చివరకు ఆమె విడాకుల దాకా చర్చకు దారి తీసింది. ఆమె ఇన్ స్టాలో ఓ పోస్టుకు లైక్ కొట్టింది. ఆ పోస్టులో.. ‘భార్యకు అనారోగ్యం వస్తే భర్త వదిలించుకోవడానికే చూస్తాడు.. కానీ భర్తకు అనారోగ్యం వస్తే భార్య అస్సలు వదిలిపెట్టదు’ అని ఉంది. ఈ పోస్టుకు సమంత లైక్ కొట్టడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. సమంతకు మయోసైటిస్ వ్యాధి సోకిన విషయం తెలిసిందే. ఆమె మూడేళ్లుగా దానితో ఇబ్బంది పడుతోంది. విడాకులు తీసుకున్నప్పుడే దీన్ని ఆమె బయటపెట్టింది. ఇప్పుడు ఆమె లైక్ కొట్టిన పోస్టుకు ఆమె వ్యాధికి లింక్ ఉందేమో.. అంటే సమంతకు మయోసైటిస్ సోకితే చైతూ పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరు విడాకులు తీసుకున్నారేమో అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సమంత ఏ ఉద్దేశంతో ఆ పోస్టుకు లైక్ కొట్టినా.. చివరకు ఆమె విడాకుల వరకు వెళ్లడం మరీ టూమచ్ గా ఉంది అంటూ ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. సమంత ప్రస్తుతం శుభం అనే సినిమాను నిర్మించింది. ఈ మూవీ కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తోంది.
రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ ఫస్ట్ లుక్ అదిరింది!
నటి రాణి ముఖర్జీ అభిమానులకు శుభవార్త. చాలా కాలంగా చర్చలలో ఉన్న ‘మర్దానీ 3’ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మర్దానీ 3’ నుండి రాణి ముఖర్జీ ఫస్ట్ లుక్ సహా సినిమా విడుదల తేదీని మేకర్స్ విడుదల చేశారు. ధైర్యవంతురాలైన పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని మేకర్స్ తెలిపారు. సోషల్ మీడియాలో యష్ రాజ్ ఫిల్మ్స్ షేర్ చేసిన ఫస్ట్ లుక్ లో, రాణి ముఖర్జీ నల్ల చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించి చేతిలో తుపాకీ పట్టుకుని చాలా మాసీ లుక్ లో కనిపించింది. ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ YRF “మర్దానీ 3 కి కౌంట్‌డౌన్ ప్రారంభమయింది. శివానీ శివాజీ రాయ్ ఫిబ్రవరి 27, 2026న తిరిగి బిగ్ స్క్రీన్ మీదకు వస్తోంది.. హోలీ రోజున మంచి, చెడుతో పోరాడుతుంది” అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. 2026 మార్చి 4న హోలీ పండుగ జరుపుకోబోతున్న క్రమంలో అంతకన్నా కొద్దిరోజుల ముందే అంటే ఫిబ్రవరి 27న, రాణి ముఖర్జీ మరోసారి శివానీ శివాజీ రాయ్ గా థియేటర్లలోకి రానుంది.
కీరవాణి, సునీతపై సింగర్ సంచలన ఆరోపణలు..
తెలుగు సినీ పరిశ్రమలో పాడుతా తీయగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సినీ పరిశ్రమ మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ అందరికీ ఈ షో గురించి దాదాపుగా తెలుసు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో ఎన్నో సీజన్ల పాటు విజయవంతంగా కొనసాగింది. ఎంతోమంది ప్లేబ్యాక్ సింగర్స్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. అయితే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా మృతి చెందిన తర్వాత ఈ షో వేరే ప్రొడక్షన్ హౌస్‌కి వెళ్లడంతో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి ఈ షోకి సంబంధించిన 25వ సీజన్ కొనసాగుతోంది. కీరవాణి, సునీత, చంద్రబోస్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షోలో సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేసింది. ఈ సీజన్‌లో తనకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసింది. నిజానికి ఆమె చిన్న వయసు నుంచి ఈ షోలో అనేక సీజన్లలో పాటలు పాడుతూ వస్తోంది. సింగర్‌గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకమ్మ, చిత్ర వంటి వారి నుంచి ప్రశంసలు అందుకుంటూ వస్తున్నాను అని చెబుతోంది.