AB Venkateswara Rao: కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారణ చేయాలని కోరారు. ఇక, ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ బాధితులు పక్షాన అవసరమైతే ప్రభుత్వ పెద్దలను కలుస్తా.. స్పందించకపోతే ఆందోళన చేస్తానని వెల్లడించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులను ద్వారంపూడి మెనేజ్ చేశారు అని ఆరోపించారు. అలాగే, ద్వారంపూడి బియ్యం కేసులో పురోగతి లభించడం లేదని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
Read Also: TG Inter Results: రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ పలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
ఇక, వీధి సుబ్రహ్మణ్యం హత్య అత్యంత నీచమైనది అంటూ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. అలాగే, అనంత బాబుని కాపాడడానికి గత ప్రభుత్వం ఎన్నో అడ్డ దారులు తొక్కింది.. విచారణను తూ తూ మంత్రంగా చేశారు పోలీసులు.. హంతకుడిని ఎలా బయటకు తీసుకురావాలనే చార్జీ షీట్ వేశారు.. ముద్దాయి చెప్పిన స్టోరిని చార్జీ షీట్ లో పెట్టారు.. పాలకులు కనుసన్నల్లో పోలీసులు చార్జిషీట్ వేశారు అని ఆరోపించారు. ఏం చేసిన చెల్లుంతుందనే విధంగా జగన్ వ్యవహరించాడు అని రిటైర్డ్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు.