Polavaram Project: మారిన పోలవరం డెడ్‌లైన్.. ఆరు నెలల ముందే పూర్తి..!
- ఆరు నెలల ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి..
- గోదావరి పుష్కరాల నేపథ్యంలో 2027 జూన్ నాటికే పోలవరం పూర్తి..
- 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం లక్ష్యం..
- పుష్కరాల నేపథ్యంలో జూన్ లోనే పూర్తి చేస్తామన్న నిమ్మల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం డెడ్‌లైన్ మారిపోయింది.. మరో ఆరు నెలల ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 2027 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటున్నామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. అయితే, 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా ప్రకటించారని అన్నారు. రాజమండ్రిలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ నిన్నటికి 202 మీటర్లు పూర్తి అయ్యిందని ప్రకటించారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేస్తామని అన్నారు. 990 కోట్ల రూపాయలతో డయాఫ్రం వాల్ నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు.
Read Also: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత ఏం జరగనుంది.. ఎక్కడ ఖననం చేస్తారంటే..?
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా ప్రకటించారు.. కానీ, గోదావరి పుష్కరాల నేపథ్యంలో 2027 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటున్నాం అని వెల్లడించారు నిమ్మల రామానాయుడు.. ఇక, డయాఫ్రమ్ వాల్ పై అవగాహన లేకుండా వైసీపీలో ఇరిగేషన్ మంత్రులు మాట్లాడారు.. ముఖ్యమంత్రిగా జగన్ ఏనాడు పోలవరం ప్రాజెక్టుపై ధ్యస పెట్టలేదని విమర్శించారు. 1200 కోట్లతో పోలవరం ఎడమ కాలువ పూర్తి చేస్తున్నాం.. ఈ వేసవిలో కాల్వల మరమ్మతుల కోసం 366 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు..
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!