Somu Veerraju: కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న ప్రతి చర్యతో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు జ్ఞానోదయం కలగాలని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. పార్వతిపురం మన్యం జిల్లాలో అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖలో మేయర్ గా కుటమి అభ్యర్థి విజయం సాధించారు.. జగన్మోహన్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని విమర్శించడం దారుణం అన్నారు.. గతంలో స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల నామినేషన్ల ప్రక్రియలోనే ఆగిపోయే విధంగా తప్పులు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ విధంగా స్థానిక ఎన్నికల్లో గెలిచిన వైసీపీ.. సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిందన్నారు.. కూటమిలో ప్రతి చర్యక జగన్ కు జ్ఞానోదయం కలగాలని వ్యాఖ్యానించారు..
Read Also: CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు
ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి తీసుకువచ్చి.. కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయల సహకారం అందించింది అన్నారు సోము వీర్రాజు.. 45 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే జోన్ ఏర్పాటును నరేంద్ర మోడీ పరిష్కరించడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.. ఆంధ్ర రాష్ట్రానికి సహకరించమని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.. అనేక రకాల కార్యక్రమలతో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు.. గ్రామాలకు వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు..
Read Also: MP Chamala Kiran: తెలంగాణ గొంతుక కాదు.. గొంతు కోసిన పార్టీ బీఆర్ఎస్!
మరోవైపు టీటీడీ గోశాల వివాదంపై మాట్లాడిన సోము వీర్రాజు.. టీటీడీ గోశాలలో దాదాపుగా 3 వేల గోవులు ఉండే అవకాశం ఉంది.. ఈ సందర్భంలో గోవులు కొన్ని వయసు రీత్యా మరణించడానికి అవకాశం ఉందన్నారు.. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ మాత్రమే.. కానీ, దీనిని వైసీపీ పరిశీలన చేయకుండా.. ఎక్కువగా దీని మీద యాగి చేస్తుందని మండిపడ్డారు.. ఇది వాస్తవానికి విరుద్ధం అని తెలుసుకోవాలని సూచించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..