కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోంది. మంత్రిగా ఉంటూనే పార్టీ వ్యవహారాలను లోకేష్ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. మహానాడు మొత్తాన్ని లోకేష్ దగ్గరుండి నడిపించారనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. వేదికను ఎంపిక చేయడం దగ్గర్నుంచి... కమిటీల ఏర్పాటు దాకా లోకేష్ పాత్ర స్పష్టంగా కనిపించింది. మహానాడు వేదిక మీద చాలామంది సీనియర్ నేతలు లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు.. ముమ్మిడివరం మండలం చెయ్యేరు వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి.. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి.. నేరుగా పెన్షన్ అందించనున్నారు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు ఎపిసోడ్లో ఎప్పటికప్పుడు ట్విస్ట్‌లు పెరుగుతూనే ఉన్నాయి. టీడీపీ తరపున మూడు సార్లు పోటీ చేసి రెండు విడతలు గెలిచిన వంశీ... ఒకసారి వైసీపీ బీ ఫామ్ మీద బరిలో దిగారు.
ఈ మధ్య కాలంలో కార్యకర్తలతో ఏ సమావేశం నిర్వహించినా వైసీపీ అధినేత జగన్ రిపీట్ చేస్తున్న ఒకే మాట జగనన్న 2.o. ఇక నుంచి కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇస్తా.. మీకోసం ఎంతదాకైనా వస్తా..... అందర్నీ గుర్తు పెట్టుకుంటానని కూడా చెప్పుకొస్తున్నారు జగన్. 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని విస్మరించి కేవలం వాలంటీర్స్‌ని నెత్తిన పెట్టుకున్నారన్న విమర్శలున్నాయి.
కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు తుస్సుమంది అంటూ సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు ప్రసంగం మొత్తం అభద్రతాభావం కనిపించింది.. కడప మహానాడు తుస్సుమంది.. ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్ లను తీసుకువచ్చారు.. ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాల సమయంలో కూడా జగన్ ను తిట్టించటం కింద నవ్వుకోవటం.. మేం మీ మీద ఇలా మీ మీద మాట్లాడలేమా..? అని ప్రశ్నించారు.. మాట్లాడితే తల్లి, చెల్లి అంటారు..