తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజవర్గం మినీ మహానాడులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అర చెయ్యే ఆయుధం అవుతుందన్నారు.. సమయం మించి పోలేదు.. ఇంకా నాలుగేళ్ల సమయం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ధర్మవరం నాకు చాలా ఓపిక నేర్పించిందన్న ఆయన.. కానీ, నాలో ఉన్న ఒరిజనల్ అలానే ఉందన్నారు.. పొద్దు మునగాలంటేనే సమయం పడుతుంది.. ఎందుకు…
ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 570 మంది పిడుగుపాటుతో మృతిచెందగా.. అత్యధికంగా విజయనగరంలో 56 మంది.. శ్రీకాకుళంలో 45, పల్నాడులో 44, నెల్లూరులో 41 మంది చొప్పున పిడుగుపాటు వలన ప్రాణాలు కోల్పోయారు.. ఇక, అత్యల్పంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ జగన్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్.. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించిన ఆయన.. జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మద్యం అక్రమాలపై ఆధారాలు చూపాలని వైఎస్ జగన్ సవాల్ చేశారు.. దీనిపై ఏమీ సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు చేతులు ఎత్తేశారని సెటైర్లు వేశారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి ఆరు సీట్లు కూడా రావన్న భయం పట్టుకుంది వైసీపీ నేతలకు అని కామెంట్ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కంటే ఏపీ లిక్కర్స్ స్కాం కేసు చాలా పెద్దదని ఆరోపించారు.. మభ్యపెట్టడం మాయ చేయడం వైఎస్ జగన్మోహన్రెడ్డి నైజమని దుయ్యబట్టారు..
ఆంధ్రప్రదేశ్లో కాకరేపుతోన్న లిక్కర్ స్కాం కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.. రాష్ట్ర పరిస్థితి, లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్న ఆయన.. వైఎస్ జగన్ గత ఐదేళ్లలో చేసిన అప్పులు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతోందన్నారు.. అయినా, బీజేపీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులకు…
వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి వంశీని కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులోనే వంశీని 2 రోజులపాటు కోర్టు అనుమతితో విచారించనున్నారు పోలిసులు. పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి.. వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే వల్లభనేని వంశీ…
ఉగ్ర కుట్ర కేసు నిందితులు సిరాజ్, సమీర్ లను కేంద్ర కారాగారం నుంచి విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. విజయనగరం పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. సిరాజ్ సమీర్ లను విజయనగరం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏడు రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. నిన్న రాత్రి 10:30 నిమిషాలకు విజయనగరం పోలీసులకు సిరాజ్, సమీర్ల పోలీస్ కస్టడీ అనుమతులు పేపర్స్ అందడంతో ఉదయాన్నే సెంట్రల్ జైలుకు చేరుకున్నారు విజయనగరం పోలీసులు. రెండు వాహనాల్లో విశాఖ సెంట్రల్…
మాజీ మంత్రి కొడాలి నానికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న నోటీసులు జారీ చేశారు కృష్ణా జిల్లా పోలిసులు. కొడాలి నానిపై అనేక కేసులు విచారణ దశలో ఉన్నాయని, ఈ సమయంలో వైద్య చికిత్స పేరుతో అమెరికా వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు డీజీపీ కి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 18న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస రావు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర సహాయం కోసం చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రక్షణ, హోం, ఆర్థిక, జలశక్తి, ఎలక్ట్రానిక్స్, ఐటీ సహా పలు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, జల వనరుల నిర్వహణ లాంటి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. Also Read:Weather Report : రుతుపవనాల ఆగమనం..…