ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరుగునుంది... ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేబినెట్లో చర్చిస్తారు... వచ్చే నెలలో అమలు చేసే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరగనుంది.. ఎస్ఐపీబీ ఆమోదించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది..
అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అనకాపల్లి జిల్లా యంత్రాంగంపై విరుచుకుపడ్డా ఆయన.. అనకాపల్లి జిల్లా అవినీతి యంత్రాంగాన్ని ఉరి తీసినా తప్పులేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఐసీస్ చేసిన కుట్రను భగ్నం చేశారు తెలుగు రాష్ట్రాల పోలీసులు.. ఇద్దరు విద్యార్థులకు తమ వైపు తిప్పుకొని పేలుళ్లకు పక్కా స్కెచ్ వేశారు.. హైదరాబాద్‌కు చెందిన సమీర్, విజయనగరానికి చెందిన సిరాజ్‌లతో పేలుళ్లకు ప్లాన్ చేశారు.. ఐసీస్ ఉచ్చులో పడి హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేశారు యువకులు.. దీనికోసం ఆన్లైన్ ద్వారా పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు సిరాజ్, సమీర్.. ఈ నెల 21, 22వ తేదీల్లో విజయనగరంలో…
నకిలీ పట్టాల పంపిణీ కేసు వ్యవహారంలో వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో విచారణ జరిగింది.. నకిలీ పట్టాల పంపిణీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కీలక ఆదేశాలు జారీ చేసింది నూజివీడు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో మహానాడు నిర్వహణకు పనులు మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ.. గతంలో ఎన్నడూ లేని విధంగా పదికి ఏడు స్థానాల్లో గెలిచి వైసీపీకి షాక్ ఇచ్చింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ మహానాడు నిర్వహించి తన బల నిరూపణకు సిద్ద మవుతోంది టీడీపీ.. రాయలసీమపై టీడీపీ గురిపెట్టిందా ? అక్కడే మహానాడు నిర్వహణకు టీడీపీ పన్నుతున్న వ్యూహం ఏమిటి ? అనేది ఇప్పుడు చర్చగా మారింది..
GVMC డిప్యూటీ మేయర్ పదవిని పోరాడి సాధించింది జనసేన పార్టీ.. గంగవరం కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును డిప్యూటీ మేయర్‌గా ఖరారు చేసింది జనసేన అధిష్టానం.. అయితే, జనసేన డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నా.. ఇప్పుడు కూటమిలో కొత్త వివాదం మొదలైంది..
ప్రముఖ శైవక్షేత్రమైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో.. మల్లికార్జునస్వామిగా దర్శనం ఇస్తారు ఆ పరమేశ్వరుడు.. నిత్యం వేలాది మంది భక్తులు మల్లికార్జునస్వామి, భ్రమరాంబ మాత దర్శనానికి తరలివస్తుంటారు.. అయితే, శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నపై సస్పెన్షన్ వేటు వేసింది పాలకమండలి..
ఇవాళ లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు రిజిష్ర్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది.. ఇక, ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది టీటీడీ..
విజయనగరం జిల్లా ద్వారపూడిలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు కారులో చిక్కుకొని మృతి చెందారు. ఒకే ఇంటిలో ఇద్దరు, వేర్వేరు కుటుంబాలకు చెందిన మరో ఇద్దరు మృతి చెందారు. ఆడుకుంటూ కారులోకి ఎక్కిన చిన్నారులు.. డోర్‌లాక్ కాకవడంతో అందులో చిక్కుకున్నారు.. ఓవైపు ఎండ.. మరోవైపు ఊపిరి ఆడకపోవడంతో.. విలవిలలాడి కన్నుమూశారు..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేరు వేరు ఘటనల్లో దాదాపు ఏడుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.