Andhra Pradesh: వేసవి తాపానికి.. ఎండల తీవ్రతను తట్టుకోలేక.. నదులు, కుంటలు, బావుల్లో ఈతలు కొడుతూ సేదతీరుతున్నారు.. అయితే, సమయంలో అనుకోని ప్రమాదాలతో ఈ ఏడాది ఇప్పటికే ఏపీలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. తాజాగా, చిత్తూరు జిల్లా వీకోటలో విషాదం నెలకొంది.. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు.. దీంతో, శోకసంద్రంగా మారింది మోట్లపల్లి గ్రామం..
Read Also: CM Chandrababu: పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలి..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీ కోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురి యువకులు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు.. గురువారం మధ్యాహ్నం సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు చెరువులో నీరు లోతుగా ఉండటంతో అక్కడ ఈతకు వెళ్లి బయటకు రాలేకపోయారు. ఎంతసేపటికి యువకులు నీటి నుంచి బయటకు రాకపోవడంతో ప్రమాదాన్ని ఊహించిన గట్టు పైనున్న సహచరులు వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు.. అయితే, ఇద్దరు యువకులు అప్పటికే మృతిచెందగా.. ఓ యువకుడికి వీకోట ఆసుపత్రి తరలించారు.. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికి అతను మృతి చెందినట్లు ధృవీకరించారు.. ఈ ప్రమాదంలో కుషాల్.. నిఖిల్.. జగన్.. అనే యువకులు ముగ్గురు మృత్యువాత పడ్డారు.. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు ఉండటం గమనార్హం..