ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర సహాయం కోసం చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రక్షణ, హోం, ఆర్థిక, జలశక్తి, ఎలక్ట్రానిక్స్, ఐటీ సహా పలు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, జల వనరుల నిర్వహణ లాంటి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. Also Read:Weather Report : రుతుపవనాల ఆగమనం..…
Weather Report : దక్షిణ భారతదేశంలో వాతావరణం కీలక మార్పులకు లోనవుతోంది. సాధారణంగా రుతుపవనాల రాకకు సూచికగా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఇది శుభవార్తే అయినా, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వాయుగుండం పశ్చిమ తీరం వెంబడి విస్తృత వర్షపాతానికి దారితీసే అవకాశం ఉంది. కేవలం అరేబియా సముద్రంలోనే కాకుండా, ఈ నెల…
రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టామని.. E-KYC తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును E-KYC చేశామని.. దేశంలో 95 శాతం ఈకైవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 4,24,59,028 మందికి ఈకైవైసీ పూర్తి అయ్యిందని.. 22,59,498 మంది కి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదని…
ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ల సమావేశంలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందన్న ఆయన.. భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు.. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదని హితవుచెప్పారు..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఏపీకి ఐదు కుంకీ ఏనుగులను అప్పగించనుంది కర్ణాటక ప్రభుత్వం.. ఈ లోపే వాటి పేర్లను విడుదల చేశారు.. మొత్తం ఐదు కుంకీ ఏనుగులు ఏపీకి రానుండగా.. 1. రంజని, 2. దేవా, 3. కృష్ణా, 4. అభిమన్యు, 5. మహేంద్రగా ప్రకటించారు..
యోగాలో ఏపీ ట్రెండ్ సెటర్‌గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలన్నారు.. ఒక సిలబస్ గా యోగ ఉండాలన్నారు.. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు.. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గం అన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు.. ప్రధాని మోడీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు..
మహిళతో సహజీవనం చేస్తున్నాడు ఓ వ్యక్తి.. ఈ సమయంలో.. సదరు మహిళ కూతురుపై కన్నేశాడు.. దీంతో, నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటూ ఆమెను వేధించసాగాడు.. మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెన తనకిచ్చి పెళ్లి చేయాలని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై బాధితురాలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్ల కుట్రను తెలంగాణ, ఏపీ పోలీసులు భగ్నం చేసి.. విజయనగరంలో ఒకరిని, హైదరాబాద్‌లో మరొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా సిరాజ్, సమీర్‌లను పోలీస్ కస్టడీకి ఇచ్చింది కోర్టు. 5 రోజులపాటు ఇద్దరిని విచారించనున్నారు పోలీసులు. సిరాజ్, సమీర్ల బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే సిరాజ్ బ్యాంకులో రూ.45లక్షల నగదు గుర్తించారు. సిరాజ్‌కు డీసీసీబీ బ్యాంకులో లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. Also Read:Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో…
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. మాజీ మంత్రి అనిల్ ని పుష్ప మూవీలో మంగళం శ్రీను తో పోల్చి విమర్శలు గుప్పించారు.. కరోనా సమయంలో ఓ హాస్పిటల్ యాజమాన్యాన్ని బెదిరించి మాజీ మంత్రి అనిల్ లక్షల రూపాయలు దండుకున్నారు..