* యాదాద్రి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం, తిరుమలాపురంలో గంధమల్ల రిజర్వాయర్ పనులకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. అనంతరం తిరుమలాపుంలో పబ్లిక్ మీటింగ్‌కు హాజరు.. భారీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రజ్ఞాపూర్ – భువనగిరి ల మధ్య వాహనాల రాకపోకలు నిలిపివేత.
* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు తో సమావేశం కానున్న నీతి ఆయోగ్ సీఈవో, సభ్యులు.. వైజాగ్ లో జి. హబ్ ఏర్పాటు కు సంబంధించి చర్చ. ఏపీకి సంబంధించి నీతి ఆయోగ్ చేయబోయే కార్యక్రమాల పై సమీక్ష…
* నేటి నుంచి ఏపీలో డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం.. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్న డీఎస్సీ పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
* నేడు తెలంగాణలో లాసెట్.. మూడు విడతల్లో జరగనున్న పరీక్ష
* అమరావతి: ఇవాళ సాయంత్రం హైద్రాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ నెల 9 సాయంత్రం వైజాగ్ వెళ్లనున్న ఏపీ సీఎం, 10 న వైజాగ్ రానున్న రాష్ట్రపతి.. ముర్ము.. గిరిజన యూనివర్సిటీ కాన్వకేషన్ కు రానున్న రాష్ట్రపతి.
* ప్రకాశం: ఇవాళ్టి నుంచి జిల్లాలో దక్షిణ సింహచలంగా పేరుగాంచిన పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఇవాళ్టి నుండి 16వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు..
* కాకినాడ: నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిసిబి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న జనసేన నేత తుమ్మల రామస్వామి.. ప్రస్తుతం జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామస్వామి
* తిరుమల: 9వ తేదీ నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు
* అనంతపురం : నేడు జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు.
* శ్రీ సత్యసాయి : గోరంట్ల మండలం సమీపంలో ఉన్న నాసిన్ అకాడమిక్ రానున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్..
* అన్నమయ్య జిల్లాలో నేటి నుండి మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం… ఈనెల 27 వరకు జరగనున్న మెగా డీఎస్సీ పరీక్షలు… జిల్లాలోని మదనపల్లెలో 3, రాజంపేటలో 1, రాయచోటిలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు… మెగా డీఎస్సీ పరీక్ష కు హాజరు కాబోతున్న 17851 మంది అభ్యర్థులు…
* నెల్లూరు : నేడు పోలీసు కస్టడీకి మాజీ మంత్రి, వైసిపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నేటి ఉదయం 10.30 నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీ. కాకాణిని న్యాయవాదుల సమక్షంలో విచారించాలన్న మెజిస్ట్రేట్
* సిద్దిపేట జిల్లా: నేడు హుస్నాబాద్ లో మంత్రుల పర్యటన.. ఉదయం 10:30 గంటలకు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో తెలంగాణ రైతు మహోత్సవం కార్యక్రమంను ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్,
* నేడు హుస్నాబాద్ – ఇందుర్తి డబుల్ రోడ్డు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
* నేడు సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటన.. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్ రావు
* మహబూబ్ నగర్: నేడు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. మూసాపేట్ మండల కేంద్రంలో పలు సబ్ స్టేషన్ లు ప్రారంభం, బహిరంగ సభ లో పాల్గొననున్న భట్టి