బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య ఘటన చోటు చేసుకున్న ఘటన రాజానగరం గైట్ కాలేజీల్లో కలకలం సృష్టించింది.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గైట్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ చదువుతోన్న బీటెక్ విద్యార్థిని పరుచూరి ప్రగతి (19) కాలేజీ హాస్టల్ లో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలు జిల్లా కోసిగిలో పెళ్లి బృందంపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు.. ఏకంగా టీడీపీ సానుభూతిపరుల పెళ్లి ఊరేగింపులో.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. మహిళలు మెడలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు వైసీపీ శ్రేణులు లాగేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు..
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. మెగా డీఎస్సీ పరీక్షల నిలుపుదలకు ‘నో’ చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మెగా డీఎస్సీ నిర్వహించకుండా ‘స్టే’ కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాజమండ్రి – కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిశలేరు దగ్గర చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమైంది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.
Nara Lokesh: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని వెల్లడించారు. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు అని పేర్కొన్నారు.
Sajjala Ramakrishna Reddy: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించదలచిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు.