Physical Harassment: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారానికి ఒడిగట్టారు కామాంధులు.. రెండేళ్లుగా బాలిక శరీంపై దాడులు చేస్తూ.. అనేక రకాలుగా చిత్రహింసలకు గురిచేశారు.. ఇక, రెండేళ్లు మౌనంగా ఆ కామాంధుల శారీరక, మానసిక హింసను భరిస్తూ వచ్చిన ఆ బాలక.. తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చినట్టు అయ్యింది..
Read Also: CM Chandrababu: ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ.. ఆగస్ట్ 15న ఉచిత బస్!
శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో మైనర్ బాలికపై గత రెండేళ్లుగా వేర్వేరుగా.. పలుమార్లు అత్యాచారం చేశారు కామాంధులు.. ఆమె ప్రైవేట్ పార్ట్స్ బలవంతంగా టచ్ చేస్తూ.. శరీరంపై దాడులు చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తూ.. పైశాచిక ఆనందం పొందారులు.. అయితే, మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రామగిరి పోలీసులు. ఈ అత్యాచార కేసును ఛేదించారు.. అందులో ఆరుగురిని అరెస్ట్ చేశారు..
Read Also: JP Nadda: 11 ఏళ్లలో దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మోడీ మార్చారు
ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న.. 15 ఏళ్ల బాలికపై రెండు సంవత్సరాలుగా శారీరక దాడులు చేసి అత్యాచారం చేసిన ఘటనలో 14 మంది నిందితులుగా ఉన్నారు.. అందులో 6 మందిని నిందితులను అదుపులోకి తీసుకున్నాం అన్నారు.. పరారీలో ఉన్న మిగిలిన ఎనిమిది మందిని కూడా త్వరలో అరెస్టు చేసి రిమాండ్ కి పంపుతామని స్పష్టం చేశారు.. నిందితులపై ఫోక్సో చార్ట్ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని వెల్లడించారు.. జిల్లాలో మహిళలపై దాడులు కానీ, అఘాయిత్యాలకుగానీ పాల్పడితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ రత్న..