Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణానికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 40 వేల ఎకరాలు అవసరం అవుతుందని అధారిటీ సమావేశంలో నిర్ణయించాం అన్నారు మంత్రి నారాయణ. రైతుల అంగీకారాన్ని తీసుకుని ల్యాండ్ పుల్లింగ్ జరుగుతుందని తెలిపారు.
MLC Nagababu: ప్రమాదవశాత్తు మరణించిన 101 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 కోట్ల 5 లక్షలు బీమా చెక్కులను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియని సందర్భం.. ఇక్కడికి వచ్చిన చాలా మంది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి వచ్చిన వారే అన్నారు.
Double-Decker Buses: చాలా కాలంగా ఎదురు చూస్తున్న అతిథి విశాఖకు వచ్చింది. బీచ్ టూరిజంకు అదనపు ఆకర్షణగా చేరింది. బీచ్ రోడ్డులో షికారు చేసేందుకు డబుల్ డెక్కర్ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దీంతో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేందుకు రెండు బస్సులను అధికారులు తీసుకుని వచ్చారు.
Nadendla Manohar: రేపు తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై స్థానిక ఎమ్మెల్యే, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వాస్తవాలు తెలుసుకుని వైఎస్ జగన్ తెనాలి రావాలి అని సూచించారు.
Polavaram-Banakacherla Project: పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థికశాఖ అధికారుల సమావేశం అయ్యారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు లక్ష్యాలు, కలిగే ప్రయోజనాలపై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు సవివరంగా వెల్లడించారు.
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మూడు రోజుల క్రితం వంశీని విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో వైద్యం కోసం జాయిన్ చేసిన జైలు అధికారులు..
Drug Peddlers Arrested: హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుగుతుంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అద్దంకి నుంచి వచ్చి కూకట్పల్లిలోని వివేకానంద నగర్ కాలనీలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు ఈ నిందితులు.
Karumuri Nageswara Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సుఖ శాంతులతో ఉండటం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఇంటికి వెళ్ళి రేషన్ అందించే పద్ధతి తీసేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Collector Ambedkar: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారంపై విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులు వ్యక్తిగత సెలవులపై వెళ్తున్నారు.. తన ఒత్తిడి కారణంగా వెళ్తున్నారని మంత్రి కొండపల్లి ఇన్ఛార్జ్ డీఆర్వో వద్ద ప్రస్తావించారు.. తన ఆదేశాలు లేకుండా మంత్రిని కలిస్తే కఠిన చర్యలే.. గ్రీవెన్ లో ఉన్న జిల్లా అధికారులకు కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు.
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజార్చటంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తన హయాం, చంద్రబాబు హయాంలోని పరిస్థితులను తెలుపుతూ ట్వీట్టర్ వేదికగా వివరాలను తెలియజేశారు.