Minister Vasamsetti Subhash: యువత పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలని, అందుకు అవసరమైన ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు సద్విని చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. సోమవారం రామచంద్రపురంలోని విజయ్ ఫంక్షన్ హాల్ లో కోనసీమ స్టార్టప్ సమ్మిట్ పేరుతో జరిగిన స్కిల్ డెవలప్మెంట్, పరిశ్రమల స్థాపనపై జరిగిన అవగాహన సమావేశంలో మంత్రి సుభాష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగాన్ని నిర్మూలించి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు రుణాలు మంజూరు చేస్తుందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు. ఎమ్మెస్ ఎంఈ ల ద్వారా పరిశ్రమలు ప్రారంభించాలనే ఆలోచన ఉండి ఒక్క అడుగు ముందుకు వస్తే.. పూర్తి సహకారం అందించి పరిశ్రమలు స్థాపించేందుకు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
Read Also: Kannappa : పిలక, గిలక పాత్రలపై వివాదం.. స్పందించిన మంచు విష్ణు..
ఇక, మహిళ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఏడాదికి లక్ష 75 వేల మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి సుభాష్. ఎలాంటి హామీ లేని రుణాలు లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉందన్నారు. రామచంద్రపురం నియోజవర్గంతో పాటు కోనసీమ జిల్లా పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన పరిస్థితులు మెండుగా ఉన్నాయని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని వ్యాపారవేత్తలుగా మారాలని పిలుపునిచ్చారు. సీడాప్, ఎమ్మెస్ ఎం ఈ, ఫుడ్ ప్రాసెసింగ్ ల ద్వారా సూచనలు, సలహాలు అందించి, బ్యాంకు రుణ సదుపాయం పొందే వరకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందజేస్తున్న ప్రత్యేక రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్..
Read Also: Mahesh Kumar Goud: ఖమ్మం జిల్లా కారణంగానే.. రేవంత్ రెడ్డి సీఎం, భట్టి డిప్యూటీ సీఎం అయ్యారు!
మరోవైపు, ఎమ్మెస్ ఎంఈ రాష్ట్ర చైర్మన్ శివ శంకర్ మాట్లాడుతూ రానున్న 2030 నాటికి ప్రతి ఇంట్లో పారిశ్రామిక ఉండాలన్నది ప్రభుత్వ ఆశయమన్నారు. యువత వినూత్నంగా ఆలోచించి, జీవితంలో ఉన్నతంగా స్థిర పడేందుకు కృషి చేయాలన్నారు. సాధించగలననే పట్టుదల, ఆసక్తి ఉంటే అనుకున్నది సాధించగలరని ప్రోత్సహించారు. కోనసీమ జిల్లాలో ఎక్కువ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగాన్ని నిర్మించాలనే పట్టుదలతో మంత్రి సుభాష్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఫ్లిప్ కార్ట్ కంపెనీ డైరెక్టర్ డిప్పి వంకాని ( ముంబై) మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతమని, ఇక్కడ తయారుచేసిన ప్రొడక్ట్స్ ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మకాలు చేసుకునేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫ్లిప్కార్ట్ లో సుమారు 6 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని, మీరు తయారు చేసిన ప్రోడక్ట్ మీరే స్వయంగా అమ్ముకునేలా వెసులుబాటు కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలననే తపనతో మంత్రి సుభాష్ తమ ఫ్లిప్కార్ట్ కంపెనీను కోనసీమ సమ్మిట్ కు ఆహ్వానించారని తెలిపారు. అనంతరం కోనసీమ సమ్మిట్ పై రూపొందించిన బ్రోచర్ను మంత్రి సుభాష్, ఎమ్మెస్ ఎంఈ చైర్మన్ శివశంకర్, వివిధ శాఖల జిల్లా అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు.