AP Government: ఉపాధి హామీ పనిచేసేవారికి గుడ్‌న్యూస్ చెబుతూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఉపాధి హామీ పథకం పనుల కోసం 176.35 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.. 2025-26 ఏడాదిలో తొలి విడతగా మంజూరు చేసిన కేంద్ర నిధులను.. ఉపాధి హామీ పథకం పనుల కోసం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. నిబంధనల మేరకు నిధులు వినియోగానికి చర్యలు తీసుకోవాలని ఏపీ పంచాయతీరాజ్ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్..
Read Also: Kuberaa : కుబేర – నో హైప్, లో బజ్, భారీ డ్యామేజ్
కాగా, ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేస్తున్న కార్మికులకు మేలు చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వీరికి రోజూ వారి వేతనం రూ.307కు పెంచారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల అమరావతిలో నిర్వహించిన ఉపాధి శ్రామికుల ఆత్మీయ కలయికలో భాగంగా బీమా పరిహారంపై కూడా ప్రకటన చేసిన విషయం విదితమే.. ఉపాధి హామీ పని చేస్తూ.. ఆ ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణించినా, తీవ్ర అంగవైకల్యానికి గురైనా ఆ కుటుంబ సభ్యులకు బీమా వర్తింప జేయనున్నారు.. ఇది ఇప్పటి వరకు గరిష్ఠంగా రూ.50వేలుగా ఉండగా.. దానిని కూటమి ప్రభుత్వం రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది..