ఏపీ లిక్కర్ స్కాం ఎపిసోడ్లో రోజుకో ట్విస్ట్ ఉంటోంది. వైసీపీపై విషం చిమ్మేందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారని, సిట్ విచారణకు హాజరవబోయే ఒకరోజు ముందు టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్‌తో ఆయన భేటీ అయ్యారంటూ వైసీపీ ఓ వీడియో రిలీజ్ చేయటం తాజా సంచలనం. సాయిరెడ్డికి టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని చెప్పడానికే వైసీపీ పెద్దలు ఈ వీడియోను బయటపెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తోంది సిట్. ఈ కేసులో నలుగురు నిందితులు రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను ఒకే సారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేసింది సిట్. ఈ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఈ నెల 29న తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది.
తెలుగు దేశం పార్టీ పండుగ మహానాడు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కడపలో మూడురోజుల పాటు జరగనున్న మహానాడు .. రేపు ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు.. పార్టీ నివేదికను మహానాడుకు సమర్పిస్తారు. పార్టీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగిస్తారు.
అంతర్జాతీయంగా పూతరేకుల తయారీకి గుర్తింపు పొందిన ఈ ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ నెయ్యి వినియోగం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.. ఎంతో ఇష్టంగా తినే పూతరేకుల్లో కల్తీ నెయ్యి వాడుతున్నారట.. పశువుల కొవ్వు వాడేస్తున్నారట.. కల్తీ నెయ్యి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతున్న వేళ.. ఆత్రేయపురం పూతరేకుల్లోనూ కల్తీ నెయ్యి వినియోగం పెరిగిపోయింది..
గుంటూరు జిల్లా తెనాలిలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన రౌడీషీటర్ అనుచరులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నెల రోజుల క్రితం ఐతానగర్లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో దాడిచేశారు రౌడీ షీటర్ లడ్డూ అనుచరులు విక్టర్, బాబూలాల్, రాకేష్.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు తెనాలి టూ టౌన్ పోలీసులు. నిందితులను ఐతానగర్ తీసుకెళ్లి నడిరోడ్డుపై అరికాలి కోటింగ్ ఇచ్చారు పోలీసులు.
వల్లభనేని వంశీని రెండోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు.. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు తాజాగా పిటిషన్ వేశారు.. ఇప్పటికే ఇదే కేసులో రెండు రోజుల పాటు వల్లభనేని వంశీని న్యాయస్థానం కస్టడీకి ఇచ్చింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని దగ్గర గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతు అయ్యారు.. ఓ పెళ్లికి హాజరు అయ్యి తిరిగి వెళ్తుండగా.. గోదావరిలో సరదాగా గడపడానికి వెళ్లారు స్నేహితులు..
కడప పేరు మార్పుపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.. పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నెలలోపు తెలపాలని కడప కలెక్టర్ శ్రీధర్ నోటిఫికేషన్ జారీ చేశారు.. ఈనెల 25 ఆఖరి తేదీ గడువు ముగియడంతో పాటు, ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్రభుత్వానికి కడప పేరు మారుస్తూ నివేదికలు పంపారు జిల్లా అధికారులు... ఈ మేరకు ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ వైఎస్సార్ కడప జిల్లాగా ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం..