Breaking : ఒక ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కలలు.. నిజానికి ఏకంగా బానిస జీవితం మారాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు ఒక భారీ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టుచేశారు. మస్కట్‌కి చెందిన వ్యక్తి సుందర్, అతని భారత భాగస్వామి సత్యనారాయణ కలిసి శతృవుల్లా అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇద్దరూ కలిసి దాదాపు 2 నుండి 4 లక్షల వరకు ప్రతి వ్యక్తిపై వసూలు చేస్తూ, దుబాయ్ షేక్‌లకు అమ్మేస్తున్న వైనం భయాందోళనలు కలిగిస్తుంది. “మీరు డబ్బులు కట్టనవసరం లేదు… అన్నీ నేనే చూసుకుంటా” అంటూ విశ్వాసం కలిగించి, లక్షలాదిమంది అమాయకులను మోసం చేశారు. టికెట్లు, విజిట్ వీసాలు పంపించి, అక్కడి షేక్‌లకు అప్పగిస్తూ వాణిజ్యంగా మార్చేశారు.
ప్రియా పాప జస్ట్ అలా నిలబడింది సార్.. అరచాకం అంతే!
ఈ హృదయ విదారక కథకు ముగింపు కావాల్సిందేనన్న ఉద్దేశ్యంతో శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు చాకచక్యంగా వల వేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల సహకారంతో సత్యనారాయణను అరెస్టు చేశారు. కాగా మస్కట్‌లో ఉంటున్న సుందర్ కోసం వేట ప్రారంభమైంది. ప్రస్తుతం సుందర్ రోల్డ్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నానంటూ మస్కట్ నుంచి అధికారులను మాయ చేస్తూ ఉంటాడట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగ ఆశతో బయల్దేరిన యువకులు ఎడారి దేశాల్లో కష్టాల కూడు తింటున్నారు. అక్కడ దుబాయ్ షేక్‌ల వద్ద వెట్టి చాకిరి చేస్తూ బానిసల జీవితం గడుపుతున్నారు.
సుందర్ ముఠా నకిలీ వర్క్ పర్మిట్లు తయారు చేసి, ఇమ్మిగ్రేషన్ అధికారులను కూడా మోసం చేయాలని ప్రయత్నించింది. కానీ పోలీసుల విజ్ఞతతో సత్యనారాయణ ఆట కట్టైంది. ఇప్పటికే సుందర్‌పై కేసు నమోదయ్యింది. త్వరలో అతనిపై లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. దుబాయ్ షేక్‌ల వలలో చిక్కుకున్న కొంతమంది బాధితులు తృటిలో తప్పించుకున్నారు. కానీ ఇంకా ఎందరో అక్కడ బంధించబడి ఉన్నారు.
Fact-check: భారత వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ దాడి.. నిజం ఏంటంటే..