Smuggling: పుష్ప సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.. పాన్ ఇండియా లేవల్‌లో ఓ ఊపు ఊపింది.. అవార్డులు తెచ్చిపెట్టింది.. అయితే, పుష్ప సినిమా తర్వాత.. కొత్త తరహా స్మగ్లింగ్ జరుగుతోందని చాలా సందర్భాల్లో బయట పడుతూనే ఉంది.. ఎర్రచందనాన్ని తరలించడానికి పుష్ప సినిమాలో హీరో.. కొత్త తరహాలో ఆలోచించి.. గమ్యానికి చేర్చినట్టుగానే.. ఆ సినిమా తర్వాత స్మగ్లర్లు తమ పంతా మార్చారనే విమర్శలు ఉన్నాయి.. అయితే, తాజాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీప్రాంతం సీలేరు నుండి గోకవరం వెళ్లే ఆర్టీసీ బస్సులో రోజ్ వుడ్ కలప మంచాలను పుష్ప సినిమా తరహాలో తరలిస్తున్నారు. పుష్ప సినిమా తరహాలో విలువైన కలపను తరలించారు స్మగ్లర్లు..
Read Also: Minister Seethakka: ప్రతి మహిళా ఎస్‌హెచ్‌జీలో ఉండాలి.. కలెక్టర్లకు మంత్రి సీతక్క ఆదేశాలు!
అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీప్రాంతం సీలేరు నుండి గోకవరం వెళ్లే ఆర్టీసీ బస్సులో రోజ్ వుడ్ కలప మంచాలను పుష్ప సినిమా తరహాలో తరలించేందుకు స్కెచ్ వేశారు.. అందులో భాంగా పుష్ప సినిమా తరహాలో విలువైన కలపను తరలించారు.. ఈ సమాచారం అందుకుని మారేడుమిల్లి వద్ద ఆర్టీసీ బస్సులో అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రోజు వుడ్ మంచాలను పట్టుకుని అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. రెండు లక్షలకు పైగా విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా మారేడుమిల్లి అటవీ ప్రాంతాల నుంచి చాప కింద నీరుల అక్రమ కలప రవాణా సాగుతుంది. అటవీ సిబ్బంది ఎన్ని చెక్ పోస్ట్ లు పెట్టినా ఫారెస్ట్ అధికారుల కళ్ళు కప్పి లక్షలాది రూపాయలు విలువైన కలప తరలిస్తున్నారు. మరోపక్క అక్రమ కలప రవాణా పై ఉక్కు పాదం వేస్తామని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.