ఇప్పటికైనా మారు.. లేకపోతే రాజకీయంగా సమాధి అవుతావు అంటూ వైఎస్ జగన్‌కు కీలక సూచనలు చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పలు అంశాలపై స్పందించారు.. టీడీపీ మహానాడుకు వెళ్తే.. అక్కడి జనాలను చూసి మైండ్ పోయిందన్నారు.. అక్కడ వచ్చింది లీడర్లు కాదు.. సామాన్య ప్రజలే ఎక్కువ అన్నారు..
పూర్తి చేసిన రోడ్లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. "గిరిజన గ్రామాలకు, PVTG ప్రాంతాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశ్యంతో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ PM జన్ మన్ పథకం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం, లక్కవరం నుండి చీదిగోంది వరకు సహకారంతో దాదాపు రూ.87.19 లక్షల వ్యయంతో 1.01 కి.మీ…
కిడ్నీ రాకెట్ మాఫియాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. సరూర్‌నగర్‌లో అలకనదం హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కొనసాగింది. సరూర్‌నగర్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును, ఇటీవలే సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13మంది అరెస్ట్ కాగా... మరో ఏడుగురి కోసం గాలింపు చేపడుతున్నారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందా నడిపినట్లు తెలిసింది.
జనాభా పెరగాలని ఇప్పటికే స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, జనాభా పెరగడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయనే చర్చ కూడా మరోవైపు సాగుతోంది.. దీంతో 20 రోజుల పాటు ప్రత్యేక సర్వే నిర్వహించడానికి సిద్ధమైంది ప్రభుత్వం.. వైద్య ఆరోగ్య.. మహిళా శిశు సంక్షేమ శాఖలకు ఈ బాధ్యతలు అప్పగించారు.. ప్రతి ఇంటిలో సర్వే నిర్వహించి.. వారి అభిప్రాయాలు సేకరించబోతున్నారు..
సినిమా థియేటర్లపై తనిఖీల ఎఫెక్ట్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.. ప్రభుత్వ తనిఖీల ఎఫెక్ట్‌తో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు దిగివస్తున్నాయి.. ఇప్పుడు సినిమా థియేటర్లతో పాటు, మల్టీప్లెక్స్‌లు ఆహార పదార్థాల ధరలపై 10 శాతం నుండి 20 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించి విక్రయాలు సాగిస్తున్నాయట.. అంతేకాదు.. బై వన్.. గెట్ వన్.. ఆఫర్లతో వినియోగదారులను తినుబండారాలు విక్రయిస్తున్నారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. తమ పార్టీ ప్రజాప్రతినిధుల తీరుపై ఫోకస్ పెట్టారు.. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలపై ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారట.. ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యేలపై వస్తున్న విమర్శలపై ప్రధానంగా ఈ సర్వే ద్వారా ఆరా తీస్తున్నారట జనసేనాని..
రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఖరీఫ్ పంట బీమా పథకాలకు నిధులు విడుదల చేసింది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్.. ఖరీఫ్ పంట బీమా పథకానికి 132 కోట్ల 58 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
గుంటూరు వెస్ట్.. రాజకీయంగా మంచి ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. కానీ... ఇక్కడ ఇన్ఛార్జ్ని నియమించుకోలేక సతమతం అవుతోందట వైసీపీ. అలాగని.... పార్టీకి ఇక్కడ నాయకుల కొరతేం లేదు
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ప్రత్యేకించి రాష్ట్రంలో ఇన్నాళ్లు పార్టీ పరిస్థితులకు భిన్నంగా... కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎంత కూటమిలో ఉన్నా... అధికారం చెలాయిస్తున్నా... సొంత బలం ఉంటేనే గౌరవం అన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ కాషాయదళం... ఆ దిశగా అడుగులేస్తోందట.