Vellampalli Srinivas: జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్న ప్రభుత్వం చేసిన తప్పుడు వాగ్దానాలు ప్రజలకు తెలిసే విధంగా పుస్తకాన్ని ఏర్పాటు చేశాం అన్నారు. కూటమి సర్కార్ కేవలం వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టడం, వైసీపీ కార్యకర్తలని అరెస్టు చేసే పనిలోనే బిజీగా ఉన్నారని వెల్లంపల్లి అన్నారు.
Read Also: Hanuman Junction: ‘హనుమాన్ జంక్షన్’ మళ్లీ వస్తోంది!
ఇక, కూటమి ప్రభుత్వాన్ని దేని గురించి అయినా ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారు అని మాజీ మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఇక, తల్లికి వందనం అనే పేరుతో రూ. 13 వేల రూపాయలు వేస్తానని చెప్పిన చంద్రబాబు.. ఎంతమంది విద్యార్థులకు తల్లికి వందనం ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని, ఇప్పుడు అదే ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు.. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు.. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అప్పుల్లో కూరుకుపోయిందని తప్పుడు ప్రచారం చేశారు చంద్రబాబు.. మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు ఎంత అప్పు చేసాడో ప్రజలు చెప్పాలి వెల్లంపల్లి శ్రీనివాస్ అడిగారు.
Read Also: The Rajasaab : టీజర్ లో ఆ లుక్ లేదు.. కారణం అదేనా..?
అయితే, 40 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉందని చెప్పుకొని తిరిగే చంద్రబాబు, దేశంలో మోడీ కంట నేనే సీనియర్ అని చెప్పుకునే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా అని వైసీపీ నేత వెల్లంపల్లి పేర్కొన్నారు. చంద్రబాబు అంటే పథకాలు అమలు చేయని వ్యక్తి.. ప్రజలు ఎవరికీ పథకాలు కూడా పథకాలు రావు.. ఎంతసేపు రెడ్ బుక్ అని భయపెట్టేలని తిరుగుతున్నారు.. ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు అన్నారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చేరి విధంగా కృషి చేస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.