TDP vs YCP: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధిపై తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ళు కొనసాగుతున్నాయి. నియోజకవర్గం అభివృద్ధిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి విసిరిన సవాల్ కు మాజీ శాసన సభ్యుడు శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఏడాదిలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేశావో ఆధారాలు తీసుకొని వస్తే చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు. అవినీతి ఎమ్మెల్యేలలో వన్ టైమ్ ఎమ్మెల్యేగా బుడ్డా రాజశేఖర రెడ్డి మొదటి ర్యాంకులో ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆరోపించారు.
Read Also: CM Revanth: వైద్య కళాశాలల పనులపై కార్యాచరణ ప్రణాళిక.. అధికారులకు సీఎం ఆదేశం..!
ఇక, సర్వేలో బుడ్డా రాజశేఖర రెడ్డి అవినీతిపై సీఎం చంద్రబాబు పిలిపించి వార్నింగ్ ఇచ్చినా సిగ్గు రాలేదని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బుడ్డా సంవత్సర కాలంలో 150 కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నాను అనబోయి.. పొరపాటున నియోజకవర్గం లో 150 కోట్లతో అభివృద్ధి చేశాడని శిల్పా ఎద్దేవా చేశారు.