Piyush Goyal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దైంది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత అందులో సాంకేతిక లోపం ఉన్నట్లు తేలడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో కేంద్రమంత్రి టూర్ తాత్కాలికంగా క్యాన్సిల్ చేయబడింది. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు తరచుగా వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య రావడం కలవర పాటుకు గురి చేస్తుంది.
Read Also: Kannappa Vs Kubera : కన్నప్ప వర్సెస్ కుబేర.. ఏ ట్రైలర్ బాగుందంటే..?
అయితే, హెలికాప్టర్ లేకపోవడంతో పర్యటన రద్దు చేసుకుని ప్రత్యేక విమానాశ్రయంలో ఢిల్లీకి వెళ్లిపోయారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. ఇక, వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లో తరుచూ సాంకేతిక సమస్యలు తల్లెత్తడంపై అధికారులు అలెర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ హెలికాప్టర్ వినియోగించడంపై నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.