Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Pemmasani Chandrasekhar: గండికోటను ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోని గండికోటకు సుమారు 78 కోట్ల పర్యాటక శాఖ నిధులను కేటాయించాం అని తెలిపారు.
Gadikota Srikanth Reddy: చంద్రబాబు పదహారేళ్ళ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చారా అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ హయంలోనే ఫ్యాక్షన్ క్రియేట్ చేశారు.. రాయలసీమలో వైఎస్ఆర్ ఫ్యాక్షన్ అరికట్టేందుకు కొత్త నేతలను తీసుకు వచ్చారు.. మీ దుష్ట శక్తుల సాయంతో జగన్ ను ఓడించినంత మాత్రాన మీరు సాధించింది ఏమీ లేదు.
YS Jagan: కృష్ణలంకలోని గల నిర్మలా శిశు భవన్ లో దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రాజకీయ ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్ దోచేశారు.. జే బ్రాండ్ తో నాసిరకం మద్యం అమ్మకాలు జరిపారు.. అలాగే, డ్రగ్స్, గంజాయితో యువత నిర్వీర్యమైపోయింది.. ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్ అమ్మితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మా ఆడబిడ్డల జోలికి వస్తే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి అని సీఎం చంద్రబాబు అన్నారు.
CM Chandrababu: జన సముద్రంతో కడప నిండిపోయింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంచి చేస్తే ప్రజలు అండగా ఉంటారని కడప ప్రజలు నిరూపించారు.. ఉదయం నుంచి అన్ని దారులు కడప వైపే చూస్తున్నాయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరిగిన మొదటి మహానాడు సూపర్ హిట్ అయింది..
JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. తాడిపత్రిలో తాజాగా, ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజూ.. తాడిపత్రిలో పర్యటిస్తున్నా.. కానీ, ప్రభుత్వ పథకాలు రావడం లేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని కామెంట్స్ చేశారు.
Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇవాళ (మే 29) ఉత్తర ఆంధ్ర తీరం దాటి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రానున్న మూడు రోజుల పాటు వరుసగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు…
రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ఇక, ప్రజల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే, జిల్లా కలెక్టర్లకు, నియోజకవర్గ స్ధాయి అధికారులకు మెమోరాండం సమర్పించాలని సూచించారు.