Perni Nani: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ఓ కేసు విషయంలో మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో టీడీపీ కార్యకర్త చందు, శ్రీహర్షలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసులో సాక్షిగా పేర్నినాని ఉన్నారు. కాగా, వరుసగా వాయిదాలకు న్యాయస్థానానికి అతడు హాజరు కాలేదు.. దీంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణకు పేర్ని నానిని కోర్టులో హాజరు పరచాలని పోలీసులని మచిలీపట్నం న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది.