ఐపీఎల్ 2025 క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. రసవత్తరంగా సాగిన ఐపీఎల్ జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో క్రికెట్ లవర్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. కాకినాడ లో ఐపీఎల్ మ్యాచ్ లు చూడడానికి ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసింది బిసిసిఐ. జూన్ 1, 3 తేదీలలో జరిగే సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ చూడడానికి ఐపీఎల్ ఫ్యాన్…
ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న సీఎస్సార్‌కు ఉదయం బిపీ హెచ్చు తగ్గులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎకో తీయించడంతో గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గుండె జబ్బులకు సంబంధించి స్పెషల్ వార్డులో పీఎస్సార్ ఆంజనేయులును ఉంచారు. ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.
చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు.. డస్టర్ పెట్టి తుడిస్తే చరిత్ర మాసిపోదు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. వైఎస్సార్ జిల్లా పేరును మార్చిన ప్రభుత్వం... NTR జిల్లా పేరు వెనుక విజయవాడను ఎందుకు చేర్చలేదు..? అని ప్రశ్నించారు.. కుచితమైన ఆలోచనలతో టీడీపీ వ్యవహరి స్తోంది అని దుయ్యబట్టారు.. ప్రభుత్వం సింగిల్ పాయింట్ అజెండా ఫాలో అవుతోంది..
గాలి జనార్దన్ రెడ్డి తరహాలో లిక్కర్ స్కామ్ లో జగన్ అండ్ కో కూడా జైలుకు వెళ్లక తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరంలో ఇవాళ ఆయన పలు కాలనీల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ కడపలో మహానాడు అత్యంత ఘనంగా జరిగిందని 7 నుంచి 8లక్షల మంది జనం పాల్గొన్నారన్నారు. ఇది చూసిన వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందన్నారు.
చంద్రబాబు స్టార్ట్ చేశారు.. దాని పర్యవసానం భవిష్యత్తులో భయంకరంగా ఉంటుందంటూ కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. నెల్లూరు సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై వరుస పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.. కల్పిత కథనాలు సృష్టించి.. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారు.. తప్పుడు…
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనికోసం మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది.. ఆ షెడ్యూల్ ప్రకారం.. జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది.. కాగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది..
ఏలూరు కలెక్టరేట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది.. కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక సిబ్బందిలో నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోంది. మంత్రిగా ఉంటూనే పార్టీ వ్యవహారాలను లోకేష్ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. మహానాడు మొత్తాన్ని లోకేష్ దగ్గరుండి నడిపించారనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. వేదికను ఎంపిక చేయడం దగ్గర్నుంచి... కమిటీల ఏర్పాటు దాకా లోకేష్ పాత్ర స్పష్టంగా కనిపించింది. మహానాడు వేదిక మీద చాలామంది సీనియర్ నేతలు లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు