కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం కావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా వేగవంతం చేశారు. అయితే, అవసరమైనన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటం లేదని, వ్యాక్సిన్లు సరిపడా అందించాలని అనేక రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, వ్యాక్సిన్ విషయంలో కేంద్రానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి లేఖ రాయనున్నారు. సరిపడా వ్యాక్సిన్లు అందించాలని కోరుతూనే, ప్రైవేట్ ఆసుపత్రులకు కేటాంచిన డోసుల్ని ఆయా ఆసుపత్రులు సరిగా వినియోగించుకోలేకపోతున్నాయని కేంద్రం దృష్టికి…
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది.. ఇక, ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని పేర్కొన్న కేంద్రం.. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని అఫిడవిట్లో పేర్కొంది… ఉద్యోగులు ప్లాంటు…
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఎలాగైనా బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలనే పట్టుదలతో ఏపీ ఉన్నా.. సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌తో వెనక్కి తగ్గి.. పరీక్షలు రద్దు చేస్తూ ప్రకటన చేసింది.. ఇక, ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు..? అని అంతా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. పరీక్షల ఫలితాలపై క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు…
తిరుపతి : చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా మహమ్మారి సోకుతోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇతరులు ఇలా చాలా మంది కరోనా బారీన పడ్డారు. అయితే.. తాజాగా ఏపీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. రెండు రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.…
శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది.. 4,66,864 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో వచ్చి డ్యామ్‌లో చేరుతుండగా… కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. ఔట్ ఫ్లో 62 వేల క్యూసెక్కులుగా ఉంది.. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 879.30 అడుగులకు చేరింది… పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 184.27 టీఎంసీల నీరు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, ఇంకా భారీగానే…
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమపై రాళ్లదాడి జరిగింది. కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్ పనులను పరిశీలించి వస్తున్న సమయంలో జి కొండూరు మండలం, గడ్డమణుగ వద్ద దేవినేని ఉమ వాహనంపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో దేవినేని ఉమ కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. దేవినేని ఉమ కారుపై దాడికి పాల్పడ్డారని…
అమరావతిలో దొంగలు పడ్డారా? డబ్బులు.. నగలు.. ఇతర ఖరీదైన వస్తువులు కాకుండా రోడ్డులు ఎత్తుకుపోతున్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రస్తుతం అమరావతిలో ఇదే హాట్ టాపిక్. ఈ దోపిడీ కేంద్రంగా రాజకీయ రగడ కూడా మొదలైంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రాజధాని కోసం నిర్మించిన రోడ్లను ఎత్తుకుపోతున్నారు! అమరావతి రెండేళ్లుగా నిఘా నీడలో ఉంది. అయినప్పటికీ పోలీసుల కన్నుగప్పి ఈ ప్రాంతంలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. వాళ్లు ఎత్తుకు పోతుంది ఇళ్లలోని బంగారమో.. నగదో కాదు.…
ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరువాత రాజధాని ప్రాంతంలో రోడ్లు వేశారు. అయితే, ఇప్పుడు ఆ రోడ్లు ఉన్నట్టుండి మాయం అవుతున్నాయి. వేసిన రోడ్లను దొంగతనం చేస్తున్నారు. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజమని స్థానికులు చెబుతున్నారు. రాత్రిసమయంలో కొంతమంది రోడ్లను తవ్వుకొని ఎత్తుకుపోతున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇదంతా అధికారపార్టీకి చెందిన వ్యక్తులే చేస్తున్నారని, రాజధానిగా అమరావతి ఉండటం వారికి ఇష్టంలేదని అందుకే అలా చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ఇది తమపని…
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 61,298 శాంపిల్స్‌ను పరీక్షించగా, 1540 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,57,932కి చేరింది. ఇందులో 19,23,675 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో 2,304 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, రాష్ట్రంలో ప్రస్తుతం 20,965…