ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.. అయితే, టెస్ట్‌ల సంఖ్య కూడా తగ్గిందనే చెప్పాలి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 57,672 శాంపిల్స్ పరీక్షిచంగా… 1,627మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 17 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు చొప్పున, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు మృతిచెందారు.. మరోవైపు ఇదే…
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో స్పీడ్ పెంచింది సీబీఐ.. ఇప్పటికే వాచ్మెన్ రంగయ్య వాంగ్మూలం ఇవ్వడంతో.. అది ఈ కేసులు చాలా కీలకంగా మారింది.. అయితే, ఇవాళ ఈ కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి, ఆయన భార్యను పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.. ఇప్పటికే పలు మార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు దస్తగిరి… ఇవాళ పులివెందుల కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉందని తెలుస్తోంది.. మధ్యాహ్నం…
‘నాడు నేడు’ సాఫ్ట్ వేర్‌ను తెలంగాణ రాష్ట్రం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్… మన బడి, నాడు నేడు సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణలోని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించేకునేందుకు అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్.. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు నేడు సాఫ్ట్‌వేర్‌ను వినియోగించింది ఏపీ ప్రభుత్వం.. ఇక, టీసీఎస్ రూపకల్పన చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణకు ఇచ్చేందుకు నిరభ్యంతర…
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచిచింది… ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోటర్ల ఎత్తుల మధ్య ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. దీని ప్రభావము వలన 28 జూలై 2021 తేదీన ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం…
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించ వద్దని కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇప్పటికే కార్మికులు ప్రకటించారు. ఇందులో భాగంగానే విశాఖలో ర్యాలీలు, నిరసన దీక్షలు చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే రాజ్యసభలో ఇదే విషయాన్ని కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈరోజు కూడా పార్లమెంట్లో మరోసారి స్పష్టంగా…
కేఆర్ఎంబీకీ ఆంధ్ర ప్రదేశ్ జలవనరులశాఖ మరోసారి లేఖ రాసింది. కృష్ణా బేసిన్ లోని రిజర్వాయర్ లలో నీటి మట్టం పెరుగుతోందని తెలిపింది. పరివాహక ప్రాంతంలో వర్షాలు పడటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ కు భారీగా వరద వస్తోందని తెలిపింది. శ్రీశైలం లో నీటి మట్టం 870 అడుగులకు చేరిందని లేఖలో వెల్లడించింది. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో జలవిద్యుత్ ఉత్పాదనకు అనుమతివ్వాలని కోరింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నీటి మట్టం పెరిగితే జల విద్యుత్ ఉత్పాదన చేసే…
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,858 సాంపిల్స్ పరీక్షించగా.. 2252 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 15 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,412 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. read also : కర్నూలు జిల్లా వైసీపీలో వారసుల హవా! ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
ఢిల్లీ : బుగ్గన రాజేంద్ర నాథ్ ఆర్థిక మంత్రిగా కన్నా అప్పుల మంత్రిగా బాగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు జివిఎల్ నరసింహారావు. ఏపీ అప్పుల ఆంద్రప్రదేశ్ గా మారిందని దేశం మొత్తానికి తెలిసిందని…కొత్త అప్పుల కోసం రోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందని ఫైర్ అయ్యారు జివిఎల్ నరసింహారావు. ఓటు బ్యాంకు కోసం, పథకాల కోసం రుణాలు చేస్తున్నారని… ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శలు చేశారు. పెన్షన్లు..జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని.. అప్పుల పై చూపించే…
ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 50 డివిజన్లలో 46 చోట్ల వైసీపీ విజయం సాధించిగా, మూడు చోట్ల టీడీపీ విజయం సొంతం చేసుకుంది. అత్యధిక డివిజన్లు సొంతం చేసుకుంటామని వైసీపీ నేతలు ముందునుంచే చెప్తూ వస్తున్నారు. చెప్పిన విధంగానే వైసీపీ 46 చోట్ల విజయం సాధించడం విశేషం. గెలుపొందిన 46 డివిజన్లలో మూడు ఏకగ్రీవాలు ఉన్నాయి. ఇకపోతే, ఏలూరులో వీలైనన్ని స్థానాలు గెలుపొంది పట్టును నిరూపించుకోవాలని చూసిన టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం మూడు…
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ దిశ నుండి గాలులు వీస్తున్నాయి. 28 జూలై 2021 న ఉత్తర బంగాళాఖాతం & పరిసరాల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు రేపు మరియు ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రా లో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు,రేపు మరియు ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రా…