శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది.. 4,66,864 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో వచ్చి డ్యామ్‌లో చేరుతుండగా… కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. ఔట్ ఫ్లో 62 వేల క్యూసెక్కులుగా ఉంది.. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 879.30 అడుగులకు చేరింది… పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 184.27 టీఎంసీల నీరు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, ఇంకా భారీగానే వదర వస్తుండడం.. డ్యామ్ పూర్థిస్థాయి నీటిమట్టానికి చేరువతున్న నేపథ్యంలో.. ఇవాళ శ్రీశైలం గేట్లు ఎత్తి.. నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.