ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 78,784 శాంపిల్స్ను పరీక్షించగా, 2,107 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,62,049 కి చేరింది. ఇందులో 19,27,438 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్లో పేర్కొన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో 1,807 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, రాష్ట్రంలో…
ప్రపంచ పులుల దినోత్సవ వేడుకలను ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పులుల సంరక్షణ కోసం తీసుకున్న చర్యల గురించి అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో పులుల సంఖ్య పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 47 నుంచి 63 కి ఈ సంఖ్య పెరిగింది. ఇక కడప, చిత్తూరు జిల్లాల్లోని అడవుల్లో పులుల ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించినట్టు…
ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని.. తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జగనన్న విద్యాదీవెనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆగస్టు 16న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఉపాధ్యాయులకు ఆగస్టు 16లోగా 100శాతం బూస్టర్ డోస్ తో పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. ఇక, విద్యాకానుక రెండవ సారి అన్ని స్కూళ్ళలో అందించేందుకు…
కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.. లేఖల పర్వం నడుస్తూనే ఉంది. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్.. 50 : 50 శాతంలో కృష్ణా నీటివాటా కేటాయించాలని కోరిన ఆయన.. ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని బేసిన్ పరిధి దాటి మళ్లిస్తుందని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపునకు…
ఏపీ కాంగ్రెస్ వ్వవహారాల పై రాహుల్ గాంధీ దృష్టి పెట్టారు. ఏపీ సీనియర్ నేతలతో స్వయంగా మాట్లాడనున్నారు రాహుల్ గాంధీ. వచ్చే 15 రోజులలో సీనియర్ నాయకులందరినీ ఢిల్లీ కి రావాలని పిలుపునిచ్చారు. విడివిడిగా ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరితో రాహుల్ సమాలోచనలు చేయనున్నారు. రాష్ట్ర సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పీసీసీ పై నిర్ణయం తీసుకోనుంది. సుమారు 20 మంది సీనియర్ నాయకుల జాబితాను సిధ్ధం చేసారు ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ జనరల్…
లోకసభలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై వాయిదా తీర్మానం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు వైసీపీ ఎంపీ చింతా అనురాధ… పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేయాలని నోటీసులో పేర్కొన్నారు.. అయితే, బుధవారం రోజు కేంద్ర జల శక్తి శాఖ క్లియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కాగా.. ఆర్థిక శాఖ నుంచి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే వరకు పట్టు వదలకుండా పోరాటం చేస్తామంటున్నారు వైసీపీ ఎంపీలు.. మరోవైపు.. ఏపీ…
శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతూనే ఉంది.. ఇన్ఫ్లో రూపంలో 4,60,154 క్యూసెక్కుల నీరు వచ్చి జలాశయంలో చేరుతుండగా… 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. మొత్తంగా 3.40 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్ నుంచి దిగువకు వెళ్తోంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం డ్యామ్లో 212.4385…
కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలను క్రమంగా అమలు చేస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్… జగనన్న విద్యా దీవెన పేరుతో.. విద్యార్థులకు అండగా నిలిచిన ప్రభుత్వం.. ఈ ఏడాది రెండో విడత జగనన్న విద్యా దీవెన నిధులు జమ చేసేందుకు సిద్ధమైంది… రాష్ట్రంలోని దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తో… రూ. 693.81 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంప్…
కేంద్ర జలశక్తిశాఖ ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. రూ.47,725 కోట్ల రూపాయలకు పోలవరం ప్రాజెక్టు అంచనాలను సవరించారు. ఈ అంచనాలను అంగీకరిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. సవరించిన అంచనాలకు సంబందించిన ప్రతిపాదనలను రేపు ఆర్ధిక శాఖలకు పంపించనున్నారు. పోలవరం సవరించిన అంచనాలకు సంబందించిన ప్రతిపాదనలు పై వచ్చేవారం కేంద్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నది. పోలవరం ప్రాజెక్టును ఈ…