స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో అధికారుల పని తీరు పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మాట్లాడుతూ… గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్ చేసుకోవాలి. వీటి సమర్థ మెరుగుపడాలంటే ఇనస్పెక్షన్ జరగాలి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్కలెక్టర్లు ఇనస్పెక్షన్లు చేయాలి. వారానికి రెండు సార్లు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు 4 సార్లు, మున్సిపల్కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు వారానికి 4 సార్లు…
ఇంటింటికి రేషన్ ను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 9 వేలకు పైగా మినీ ట్రక్కులను కొనుగోలు చేసింది. ఈ ట్రక్కులను లబ్ధిదారులకు అందజేసింది. షెడ్యూలు కులాల వారికి ఈ ట్రక్కులను అందజేసింది. ఈ మినీ ట్రక్కులపై గతంలో ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ ఇచ్చింది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారుడు పెట్టుకోవాలి. అయితే, ఇప్పుడు ఇందులో మార్పులు చేసింది ప్రభుత్వం. 60 శాతం ఉన్న సబ్సిడీని 90 శాతానికి పెంచింది. 10 శాతం మాత్రమే లబ్ధిదారుడు పెట్టుకోవాలి.…
ఆంధ్రప్రదేశ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రియల్ ఎస్టేట్ మోసాలకు చెక్ పెట్టేందుకు, మిడిల్ క్లాస్‌కు స్వయంగా లేఅవుట్లను వేయనుంది.. రాష్ట్రవ్యాప్తంగా మధ్య ఆదాయ వర్గాల కోసం నిర్దేశించిన ఎంఐజీ లే అవుట్లను వేసేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు వినియోగించని భూముల్ని అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేషన్లకు వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించి నిరుపయోగంగా ఉన్న భూముల్ని పురపాలక శాఖకు తిరిగి అప్పగించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది. మధ్యాదాయ…
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై రాహుల్ గాంధీ దృష్టిసారించారు.. రాహుల్‌తో సమావేశమైన ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి.. బలోపేతానాకి తీసుకోవాల్సిన చర్చలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్ ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం.. రాష్ట్రానికి చెందిన పలు సీనియర్లకు జాతీయస్థాయులో పార్టీలో బాధ్యతలు అప్పచెప్పాలన్న ఆలోచనలో రాహుల్ ఉన్నారని చెబుతున్నారు.. ఏపీలో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను మళ్లీ కదిలించేందుకు..…
తూర్పుగోదావరి జిల్లా : గోదావరి వరద ప్రవాహం శాంతించినట్లు కనిపిస్తోంది. దీంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. గౌతమి, వృద్ధగౌతమి, వైనతేయ, వశిష్ఠ నదీపాయలలో శాంతించి క్రమంగా తగ్గుముఖం పట్టింది వరద. ఇక అటు పి.గన్నవరం మండల పరిధిలోని గంటిపెదపూడి శివారు బూరుగులంక, పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఊడిమూడి శివారు ఊడిమూడిలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. read also : మహిళలకు షాక్… మళ్లీ పెరిగిన బంగారం ధరలు అధికారులు ఏర్పాటు చేసిన రెండు ఇంజన్ పడవలపైనే…
శ్రీశైలం జలాశయానికి వరద వరద ఉధృతి పెరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి ఎక్కువ నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 3,22,262 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 31,784 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 874.40 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 160.9100 టీఎంసీలు ఉంది.…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు పోటాపోటీగా లేఖలు రాస్తున్నాయి. అయితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది… రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పై నిర్మించిన, నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని లేఖలో పేర్కొంది కేఆర్ఎంబీ… కాగా, ఇప్పటి వరకు ఒక రాష్ట్రం పై మరో రాష్ట్రం ఆరోపణలు చేస్తూ రాగ……
గుంటూరు సిటీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావుపై కేసు నమోదు చేసింది సీబీఐ… పొగాకు కొనుగోలు కంపెనీ పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి రూ.45 కోట్ల రుణాలు తీసుకున్న వెంకట్రావు.. రూ.19 కోట్ల రుణాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టినట్టు అభియోగాలున్నాయి… బ్యాంకు ఫిర్యాదుతో తాడిశెట్టి వెంకట్రావు, మురళీమోహన్‌పై కేసు నమోదు చేసింది సీబీఐ.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో వెంకట్రావు ఆస్తులపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.. కాగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో..…