ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 78,992 శాంపిల్స్ పరీక్షించగా… 2,058 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 23 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 2,053 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. తాజాగా చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూల్లో ఇద్దరు చొప్పున,…
మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది.. మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. దీంతో.. ఆయనపై 153 ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు… అయితే, కేసులపై సీరియస్‌గా స్పందించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఏవరిని రెచ్చగొట్టారని కేసు నమోదు చేశారో తెలియదని కామెంట్ చేసిన ఆయన.. కేసు పెట్టిన విషయం కూడా…
కేంద్రమంత్రులు పశుపతి పరాస్ పాశ్వాన్, కిషన్ రెడ్డిని ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి పశుపతి పరాస్ పాశ్వాన్ ను కలిశాను. రాష్ట్ర విభజన తరువాత ఏపీ 74 శాతం వ్యవసాయం పై ఆధారపడింది. ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ నుంచి ఉన్న పథకాలను యధావిధిగా కొనసాగించాలని కోరాం. వ్యవసాయం ,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకుముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి వివరించాం. పోలవరం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు.. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై మావనతాదృక్పథంతో స్పందించిన సీఎం.. మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలన్నారు సీఎం.. ఇక,…
ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా జేసీ బ్రదర్స్‌ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. కొన్ని కేసులు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలులో కూడా ఉండివచ్చారు.. రిలీజైన వెంటనే మళ్లీ కేసులు వెంటాడాయి. ఇక, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది.. మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలేది లేదు అనే తరహాలో.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అందరినీ టచ్ చేస్తూనే ఉంది… ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు సోకిన వైరస్.. కొంత మంది ప్రాణాలు కూడా తీసింది.. తాజాగా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనాబారనపడ్డారు.. గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారి లక్షణాలతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు ఎమ్మెల్యే…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 80,641 సాంపిల్స్ పరీక్షించగా.. 2,068 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 22 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,127 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,64,117 కు పెరగగా… రికవరీ కేసులు 19,29,565 కు చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్…
ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసులు తగ్గుతున్నా తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో ముందుజాగ్రత్తలో భాగంగా నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఆగస్టు 14 వ తేదీ వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఏపీలో రోజువారీ కేసులు 2 వేల వరకు నమోదవుతున్నాయి.…
కడపజిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వైసిపికి చెందిన ముగ్గురు, బిజెపీకి చెందిన ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో బిజెపీకి చెందిన ముగ్గురు కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉంది. బీజేపీ కార్యకర్తలు గోపు ప్రసాద్, చిన్న నరసింహులు, పెద్ద నరసింహులు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు నరేంద్ర, ఆంజనేయులు గాయపడగా…ఈ ఘర్షణలో గ్రామ వాలంటీర్ వెంకటేష్ కూడా గాయాలయ్యాయి. read also : హైదరాబాద్…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రం విడిపోయాక ఏపీలో దారుణంగా దెబ్బతిన్నది. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటుకూడా గెలుచుకోలేకపోయింది. ఆయితే, ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ పగ్గాలు రేవంత్‌కు అప్పగించిన తరువాత కొంద దూకుడు పెరిగింది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌లో కూడా ప్రక్షాళన చేసి కొత్త జవసత్వాలు నింపేందుకు పార్టీ అధిష్టానం పావులు కదుపుతున్నది. Read:…