పల్నాడు జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఘటన చాలా దురదృష్టకరమని.. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు అసాంఘిక, సంఘ విద్రోహుల కారణంగా హింసాత్మక ఘటనలు జరిగాయని కొడాలి నాని ఆరోపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై కొడాలి నాని ఫైర్ అయ్యారు. అమలాపురంలో పిల్లలను రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు చేశారు.…
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి. జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుతమైన వేడుక. అందుకే కాస్త ఆలస్యమైనా మంచి ముహూర్తం చూసుకుని పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే కరోనాతో గత రెండేళ్లుగా పెళ్లిళ్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంచి ముహూర్తాలు ఉండటం, కరోనా ఉధృతి తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల హడావిడి నెలకొంది. అయితే ఈ ఏడాది జూన్ నెల దాటితే ముహూర్తాలు లేవని పండితులు స్పష్టం చేస్తున్నారు. మళ్లీ డిసెంబర్ వరకు ముహూర్తాలు లేకపోవడంతో…
వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీపై చంద్రబాబు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని. . ప్రజలంతా క్విట్ చంద్రబాబు, క్విట్ తెలుగు దేశం అంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ జవసత్వాలు అయిపోయాయని ఆరోపించారు. చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో తనది అనుకున్న ఒక్క కార్యక్రమమైనా ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉంటే…
వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయభేరీ యాత్ర గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు చేరుకుంది. ఈ మేరకు విజయనగరం జిల్లాలో పైడి భీమవరం నుంచి వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ యాత్ర ప్రారంభమైంది. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ నేతల బస్సు యాత్ర వలస గ్రామం చేరుకుంది. అక్కడ బహిరంగసభ అనంతరం మంత్రుల బస్సు యాత్ర విజయనగరం పట్టణంలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా విజయనగరంలో ప్యూమా జంక్షన్ వద్ద ఏర్పాటు చేసినభారీ బహిరంగ…
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నన్ను అంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. ఓ కేసు విషయంలో ఏలూరు జిల్లా కోర్టులో సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రైవట్ కేసు ఫైల్ చేసిన ఆయన… ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన భద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ ఆరాచకాలపై కేంద్ర…
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తులపై అప్పుడు పెద్ద చర్చ సాగుతోంది.. అయితే, ఇప్పటికే పలు సందర్భాల్లో పొత్తులపై మాట్లాడిన బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్.. మరోసారి క్లారిటీ ఇచ్చారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే విషయంపై పలు రకాల వార్తలు వస్తున్నాయి.. టీడీపీ, వైసీపీలకు బీజేపీ దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక, జనసేన పార్టీతో మాత్రమే పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని కార్యకర్తలకు స్పష్టం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. పాలితులుగా ఉన్న వర్గాలను పాలకులుగా నియమించారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల నేతలు గతంలో రాజ్యాధికారం రావాలని ఉద్యమించారు.. సీఎం జగన్ విశాలభావం కారణంగా ఇప్పుడు మార్పు వచ్చిందన్నారు. ఒకలక్షా ఇరవై వేల కోట్లు పథకాలకు కేటాయించారని గుర్తుచేసిన ఆయన.. కమ్మర, కుమ్మరి, పొందర లాంటి కులాలు…
జిల్లా పేరు మార్పు కోనసీమ జిల్లాలో విధ్వంసం సృష్టించింది… తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.. ఈ ఘటనపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది.. తప్పు మీదంటే.. మీదేనంటూ దూషించుకుంటున్నారు నేతలు.. అయితే, ఈ ఘటనపై ఎన్టీవీతో మాట్లాడిన హోం మంత్రి తానేటి వనిత.. అసలు కోనసీమ విధ్వంసం ఊహించ లేదు, హఠాత్తుగా జరిగిందని పేర్కొన్నారు. అంబేద్కర్ పేరు పెట్టకపోతే జనసేన నాయకుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించిన ఆమె.. ధర్నాలు, నిరాహార…
సామాజిక న్యాయ భేరి పేరుతో బస్సు యాత్రకు సిద్ధమైంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. గతంలో జరిగిన సామాజిక అన్యాయం, గత మూడేళ్లుగా ప్రభుత్వం ఆచరిస్తున్న సామాజిక న్యాయాన్ని చాటి చెప్పేలా నేటి నుంచి ఈ నెల 29 వరకు 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులతో ఈ బస్సు యాత్ర సాగనుంది.. ఇవాళ ఉత్తరాంధ్రలో ప్రారంభమైన ఈ యాత్ర.. నగరాలు, పట్టణాలు, ప్రాంతాల మీదుగా 29వ తేదీన అనంతపురం వరకు…
జిల్లా పేరు మార్పు వ్యవహారంలో కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. జిల్లా కేంద్రమైన అమలాపురం అట్టుడికిపోయింది.. విధ్వంసానికి దారితీసింది.. అయితే, ఈ ఘటనపై ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూనే ఉన్నా.. ప్రస్తుతం మాత్రం అమలాపురంలో ప్రశాంత వాతావరణం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.. అయితే, కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.. సెక్షన్ 144, పోలీసు యాక్ట్ 30 అమలులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. Read Also:…