ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయం వ్యవహారం హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.. ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ.. పలు ఆన్‌లైన్ విక్రయ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలపై వైఎస్ జగన్ సర్కార్ ఇచ్చిన జీవోను సవాల్ చేశాయి మల్టీప్లెక్స్‌లు, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ప్రైవేట్ ఆన్‌లైన్ విక్రయ సంస్థలు.. దీనిపై విచారణ జరగగా.. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది.. జూలై 1వ తేదీన ప్రకటిస్తామని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది ఏపీ హైకోర్టు.
Read Also: Astrology: జూన్ 30, గురువారం దినఫలాలు
కాగా, సినిమా టికెట్ల విక్రయంపై రెండ్రోజులపాటు వాదనలు జరగ్గా.. బుధవారం ఎగ్జిబిటర్స్, మల్టీప్లెక్స్‌ల తరఫున న్యాయవాదుల వాదనలు వినిపించారు.. ఆ తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.. అయితే, సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుతుందని జీవో నెంబర్ 69ను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కానీ, టికెట్ల అమ్మకం తర్వాత వచ్చిన ఆదాయాన్ని తిరిగి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో.. ఈ విషయంపై నిర్మాతల మండలి ప్రభుత్వానికి లేఖలు కూడా రాసింది.. ఆ తర్వాత జీవో నెంబర్ 69ను సవాల్ చేస్తూ.. మల్టీప్లెక్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ప్రైవేట్, ఆన్‌లైన్ విక్రయ సంస్థలు హైకోర్టును ఆశ్రయించారు..