సాధారణంగా పెద్దవారు ఒక మాట చెప్తూ ఉంటారు.. మహిళ ఏదైనా తట్టుకుంటుందేమో కానీ తన భర్తను వేరొకరితో పంచుకోవడం మాత్రం తట్టుకోలేదని.. అయితే ఇది కొంత వరకు నిజమే.. తనకు మాత్రమే పంచాల్సిన ప్రేమను భర్త వేరొకరికి పంచుతుంటే భార్యకు కోపం రావడం సహజం.. అయితే ఆ కోపంలో ఎంత నీచానికైనా దిగజారడం నేరం. తాజాగా ఒక భార్య, తన భర్త వేరొక యువతితో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో దారుణానికి పాల్పడింది. భర్త మాట్లాడుతున్న అమ్మాయిని ఇంటికి…
జూన్ 1 నుంచి జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న శ్రీకాకుళం జిల్లా, జూన్ 2న విజయనగరం జిల్లా, జూన్ 3న విశాఖ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. ఈ పర్యటనలో మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలోని జనసేన పార్టీ ముఖ్య నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, నియోజకవర్గ కమిటీ నాయకులకు, ఆయా విభాగాల కమిటీ నాయకులకు,…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు పథకాలు ఏమీ ఇవ్వనని చంద్రబాబు పరోక్షంగా చెప్తున్నారని బొత్స ఆరోపించారు. సంక్షేమ పథకాల రూపంలో డీబీటీ ద్వారా చేసిన ప్రయోజనం పేద ప్రజల కోసం కాదని.. రాజకీయ ప్రయోజనాల కోసం అన్నది చంద్రబాబు ఉద్దేశమన్నారు. ఇది దుర్మార్గపు ఆలోచనగా బొత్స విమర్శలు చేశారు. ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబుకు పేరుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా క్రీములు, పౌడర్ల…
కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ అమలాపురంలో జరిగిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు విధించిన 144 సెక్షన్ను మరో వారం రోజులు పొడిగించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ సేవల నిలుపుదలను కూడా మరో 24 గంటల పాటు పొడిగించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ చెలరేగిన అమలాపురం అల్లర్లలో ధ్వంసమైన ఆస్తుల నష్టాన్ని నిందితుల నుండే రాబడతామని ఆయన స్పష్టం చేశారు. Konaseema Riots:…
ఏపీ మంత్రులు తలపెట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. విశాఖ పాత గాజువాక వైఎస్ఆర్ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం అమలాపురం అల్లర్లపై స్పందించారు. ఏపీలో ప్రతిపక్షాలు కావాలనే అల్లర్లు సృష్టిస్తున్నాయని స్పీకర్ తమ్మినేని ఆరోపించారు. టీడీపీ వాళ్లు చేసేది మహానాడు కాదు వల్లకాడు అని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. చచ్చిన పార్టీకి ప్రజలు దహన సంస్కారాలు…
టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను వైసీపీ ప్రభుత్వం హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను హతమార్చేందుకు ఇప్పటికే రెండు సార్లు ఎన్కౌంటర్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. 2019లో ఒకసారి, 2021లో మరోసారి ఎన్ కౌంటర్ చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు ఆయన వివరించారు. సకాలంలో టీడీపీ నాయకులు స్పందించకుంటే తాను ఎప్పుడో చనిపోయేవాడినని చింతమనేని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. Three Gorges…
వైసీపీ మంత్రులు ప్రారంభించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రం రెండోరోజుకు చేరుకుంది. విశాఖలోని పాత గాజువాక జంక్షన్ నుంచి రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు బస్సు యాత్రను ప్రారంభించారు. రెండో రోజు విశాఖ, తూ.గో. జిల్లాలలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర జరగనుంది. లంకాలపాలెం జంక్షన్, అనకాపల్లి బైపాస్, తాళ్లపాలెం జంక్షన్, యలమంచిలి వై రోడ్డు జంక్షన్, నక్కపల్లి, తుని, అన్నవరం, జగ్గంపేట మీదుగా ఈ…
శ్రీకాళహస్తిలోని పిన్ కేర్ అనే ప్రైవేట్ బ్యాంక్లో గురువారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బ్యాంకు మేనేజర్ ఆడిటింగ్ చేస్తున్న సమయంలో కొందరు దుండగులు బ్యాంకులోకి వెళ్లి మహిళా ఉద్యోగులను బెదిరించి వాళ్లను బంధించారు. అనంతరం వాళ్ల దగ్గర లాకర్ రూమ్ తాళాలు తీసుకుని రూ.85 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి వన్టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.…
★ ఏపీలో నేడు, రేపు తెలుగుదేశం ‘మహానాడు’ కార్యక్రమం.. ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం వద్ద మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు ★ నేడు విశాఖ, తూ.గో. జిల్లాలలో వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ★ కోనసీమలో వరుసగా మూడోరోజు ఇంటర్నెట్ బంద్.. బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ★ సత్యసాయి జిల్లా: నేడు హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన ★ నెల్లూరు జిల్లా: నేడు మనుబోలులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి…
ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్కోచ్ ‘స్టార్ ఆఫ్ గవర్నెన్స్-2021’ అవార్డుకు ఎంపికైంది. జూన్ 18న ఢిల్లీలో జరిగే ఇండియన్ గవర్నెన్స్ ఫోరం వేదికగా ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో స్కోచ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ వెల్లడించారు. Kodali Nani: చంద్రబాబు-పవన్ కలయిక.. ఏపీకి పట్టిన దరిద్రం కాగా గ్రామీణాభివృద్ధి…