ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన పుష్పశ్రీవాణి ఈ మధ్య ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతూ వస్తున్నారు.. జగన్ 1 కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆమెకు.. జగన్ 2 కేబినెట్‌లో మాత్రం చోటు దక్కలేదు.. అయితే, వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు.. ఇక, ఇవాళ పార్వతీపురం జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆమె.. టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు.. తాను అవినీతి చేశాను అని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పేర్కొన్నారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సవాలును స్వీకరించిన పుష్ప శ్రీవాణి… జులై 11వ తేదీన ఉదయం 11 గంటలకి కురుపాం నడి బొడ్డులో గల రావాడ జంక్షన్‌లో కూర్చుందాం… సాక్ష్యంతో టీడీపీ నాయకులు రావాలంటూ ప్రతి సవాల్ విసిరారు.. ఇక, తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.
Read Also: WPI Inflation: 30 ఏళ్ల గరిష్టానికి టోకు ధరల సూచీ..
కాగా, పుష్ప శ్రీ వాణిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. గతంలోనే వాటిపై స్పందించిన ఆమె.. రచ్చకు మేం సిద్ధం.. ఏ సెంటరైనా ఓకే.. మీరు చెబుతారా..? నన్ను చెప్పమంటారా? అంటూ వ్యాఖ్యానించారు.. ఇప్పుడు వైసీపీ ఫ్లీనరీ వేదికగా మరోసారి బహిరంగ సవాల్ విసిరారు.. మరి, టీడీపీ శిబిరం పుష్ప శ్రీ వాణి సవాల్‌పై ఎలా స్పందిస్తుంది.. బహిరంగ చర్చ జరిగే అవకాశం ఉందా.. రావాడ జంక్షన్‌లో చర్చ జరిగే అవకాశం ఉందా..? అదే జరిగితే కురుపాం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతందా? అనేది ఉత్కంఠగా మారింది.