ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి దాదాపు రూ.800 కోట్లు మాయం కావడం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపింది.. దీనిపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.. ఇక, దీనిపై క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సాంకేతిక సమస్య వల్ల జీపీఎఫ్ ఖాతాల్లో క్రెడిట్-డెబిట్ లావాదేవీలు జరిగాయని పేర్కొంది సర్కార్.. జీపీఎఫ్ ఖాతాల గందరగోళంపై నివేదిక ఇచ్చారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్… డీఏ బకాయిల బిల్లులు ఆమోదం పొందకుండానే పొరపాటున జీపీఎఫ్ ఖాతాల్లో నిధులు జమ అయినట్టు ప్రభుత్వం పేర్కొంది.. బిల్లుల ఆమోదం పొందకుండా నిధులు జమయ్యాయి.. కాబట్టి, ఆ నిధులను వెనక్కు తీసుకున్నట్టు స్పష్టం చేసింది.. అయితే, ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు పెండింగులో ఉన్నాయని తెలిపింది.. త్వరలోనే పెండింగ్ డీఏలను చెల్లిస్తామని స్పష్టం చేసింది ఏపీ సర్కార్..
Read Also: CM Jagan: సత్యసాయి జిల్లాలో ప్రమాదం సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
కాగా, ట్రెజరీ నిబంధనల ప్రకారం మార్చి 31 నాటికి పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ రద్దవుతాయి. అందుకే ఆ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్ వెనక్కి పంపించింది అని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం.. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం డబ్బులు డ్రా చేయలేదని స్పష్టం చేశారు.. ఈ సాంకేతిక సమస్యను సరిదిద్దుతున్నట్లు తెలిపారు. ఉద్యోగుల డీఏ బకాయిలను వీలైనంత త్వరలో వారికి చెల్లిస్తామన్నారు.. ట్రెజరీ, సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) ద్వారా బిల్లులు పాస్ చేసే విధానంలో జరిగిన పొరపాటుతో ఈ సమస్య ఎదురైందన్నారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్.