సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలి పనుల నిమిత్తం ఉదయాన్నే వెళ్తున్న కూలీల ఆటోపై విద్యుత్ హైటెన్షన్ తీగలు తెగి పడ్డాయి. దీంతో ఆటోకు విద్యుత్ షాక్ తగిలి మంటలు చెలరేగాయి.. మంటలు ఒక్కసారిగా తీవ్రం కావడంతో ఆటోలో ఉన్న 11 మందిలో 8 అక్కడికక్కడే సజీవ దహనం అయినట్లు సమాచారం. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
తాడిమర్రి మండలం పెద్దకోట్ల పంచాయతీ గడ్డంనాగేపల్లి గ్రామానికి చెందిన పది మంది కూలీలు పనుల నిమిత్తం కునుకుంట్ల గ్రామానికి చెందిన డ్రైవర్ తలారి పోతులయ్య ఆటోలో చిల్లకొండయ్యపల్లికి బయల్దేరి వెళ్లారు.. ఆటో చిల్లకొండయ్యపల్లికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో విద్యుత్ హైటెన్షన్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ తీగలు పడడంతో క్షణాల వ్యవధిలో ఆటోకు మంటలు వ్యాపించాయి. కూలీలు బయటకు వచ్చేలోపు ఆటో మొత్తం తగలిబడిపోయింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా పూర్తిగా కాలిపోవడంతో వారు ఎవరిన్నది కూడా గుర్తించలేకుండా ఉంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, ప్రజాప్రతినిధులు ఘటనా స్థలానికి వెళ్లి, సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్టుగా చెబుతున్నారు.
Read Also: Taslima Nasreen: భారతదేశంలో హిందువులు కూడా సురక్షితంగా లేరు.