ఏపీలో వేసవి సెలవుల అనంతరం జూలై 4న పాఠశాలలు రీఓపెన్ కావాల్సి ఉంది. ఈ మేరకు గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ప్రభుత్వ పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా అంటే జూలై 5న పున:ప్రారంభం కానున్నాయి. జూలై 4న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మంగళగిరి పరిధిలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో స్కూళ్ల రీ ఓపెన్‌ను వాయిదా వేసి జూలై 5న పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.…
ఏపీ సీఎం జగన్ ఈనెల 23న తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయం అధికారికంగా విడుదల చేసింది. ఈనెల 23న ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా బయలుదేరి ఉదయం 11 గంటలకు తిరుపతి రూరల్ మండలం పేరూరు చేరుకోనున్నారు. ఉదయం 11:15-11:45 గంటల వరకు శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం…
వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సంపాదించారు. 1998లో డీఎస్సీ రాసిన ఆయన ఎట్టకేలకు ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1998 డీఎస్సీ పోస్టింగుల కోసం అభ్యర్థులు సుమారు 23 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. 1998 డీఎస్సీపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఇన్నాళ్లూ పోస్టింగులు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా వివాదాలు పరిష్కారం కావడంతో సీఎం జగన్ 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాల కేటాయింపు ఫైలుపై సంతకం చేశారు. ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ…
ఏపీలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. టైర్-2 నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. ఈ మేరకు విశాఖలో విడతల వారీగా మూడు వేల సీటింగ్ కెపాసిటీ గల క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రతినిధులు వెల్లడించారు. ఇటీవల ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఇన్ఫోసిస్ ప్రతినిధులు సమావేశమై క్యాంపస్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించారు. విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు చేయడంపై మంత్రి గుడివాడ…
గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతో ఆర్టీసీ గడ్డు కాలమే చూసింది.. అయితే, కోవిడ్ తగ్గుముఖం పట్టడం, ప్రయాణికులు ప్రజా రవాణా ఉపయోగించటంతో మళ్లీ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చినట్టు అయింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ రావటం, వేసవి సెలవులతో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య అధికమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా పరిధిలో అక్యుపెన్సి రేషియో సగటున 70 శాతానికి పైగా చేరుకుంది. ఏప్రిల్, మే నెలల్లో ఏసీ బస్సుల్లో అక్యూపెన్సీ రేషియో 80…
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబును గతనెల 23న అరెస్ట్ చేశారు పోలీసులు… అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు.. ఇవాళ్టితో ఆయన రిమాండ్ ముగియడంతో ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు… భద్రతా కారణాల దృష్ట్యా ఆయనకు ఎస్కార్ట్ కల్పించలేమని జడ్జికి విన్నవించారు పోలీసులు… దాంతో అనంతబాబును ఆన్లైన్లో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు… అయితే, జులై 1వ తేదీ వరకు మెజిస్ట్రేట్ రిమాండ్ ను పొడిగించారు……
పట్టణాభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. గతంలో పరిస్థితులు, మెరుగుపడిన విధానం.. జీతాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. నగరాలు, పట్టణాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లు ఆర్వోబీలను సత్వరమే పూర్తి చేయాలని.. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలి ఆదేశించారు.. ఇక, సీఆర్డీఏ పరిధిలోని పనుల పురోగతిని సమీక్షించిన సీఎంకు.. కరకట్ట రోడ్డు నిర్మాణం కొనసాగుతోందని వివరించారు అధికారులు.. క్వార్టర్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని.. సీడ్‌యాక్సిస్…
ఆర్మీ రిక్రూట్మెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ వివాదాస్పదంగా మారింది.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో యువత దీనిపై ఆందోళనకు దిగడం, విధ్వంసానికి పాల్పడడం చర్చగా మారింది.. అయితే, అగ్నిపథ్ పథకంపై కొంత మంది యువత అపోహకి గురయ్యారని చెబుతున్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. త్రివిధ సైనిక బలాల నిర్ణయం మేరకు అగ్నిపథ్ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పింది… ఈ ఏడాది 46…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది భారతీయ జనతా పార్టీ.. ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.. వైసీపీ కార్యకర్తల్లా వాలంటీర్లు కరపత్రాలను పంపిణీ చేస్తున్నారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.. Read…
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు ఎత్తులు.. జిత్తులపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన రెండు కలిసి పోటీ చేస్తాయని అనుకుంటున్నారు. ఆ మధ్య కుప్పం పర్యటనలో చంద్రబాబు… జనసేనకు వన్‌సైడ్ లవ్ అని కన్నుగీటారు. ఆ తర్వాత జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మాటలు.. ప్రకటనలతో రెండు పార్టీలు దగ్గరవుతున్నట్టు భావించారు. కానీ.. ఇటీవల నిర్వహించిన మహానాడు తర్వాత టీడీపీ…