రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారింది. గత సంప్రదాయాలకు అనుగుణంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును రాష్ట్రపతిని చేస్తారని అంతా భావించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన్ని హుటాహుటిన ఢిల్లీ రావాలని చెప్పడం.. ఆ తర్వాత అమిత్ షా తదితరులు వెంకయ్య దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఆయనే తదుపది రాష్ట్రపతి అభ్యర్థిగా అందరూ భావించారు. సంఖ్యా పరంగా ఎన్డీయేకు రాష్ట్రపతిని గెలిపించుకునే బలం ఉండటంతో.. చాలా…
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తికావడంతో రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎన్డీఏ ప్రకటించింది. ఈనెల 24న శుక్రవారం నాడు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మూకు ఏపీలోని వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన మహిళకు ఇవ్వడం శుభ…
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించారు. బొల్లాపల్లి మండలం రావులాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కారు ముందు భాగంలో కూర్చుని అభిమానులకు లోకేష్ అభివాదాలు చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలను హత్య చేస్తే భయపడతామని జగన్ మాఫియా రెడ్డి భ్రమపడుతున్నారని ఆరోపించారు.…
ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని జనసేన పార్టీ బలంగా విశ్వసిస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో జనసేన పార్టీలోకి చేరికలు షురూ అయ్యాయి. ఈ క్రమంలో ఏపీ కేడర్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన దేవ వరప్రసాద్ గురువారం నాడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్‌కు జనసేన…
టీడీపీ నేత నారా లోకేష్‌పై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడ బిడ్డ పుట్టినా నేనే నాన్న అంటూ పరుగెత్తుకుని వెళ్లేరకం లోకేష్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో నాలుగు సార్లు పరిశ్రమల సమ్మిట్ పెట్టారని.. ఖర్చుల పేరుతో రూ.150 కోట్లు చూపించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఫోటోల్లో పారలు పట్టుకున్నది ఎక్కడ.. పరిశ్రమ వచ్చింది ఎక్కడో లోకేష్ చెప్పగలడా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో సూటు,…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు అధికారులు తరలించారు. ఈనెల 26న ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం వెల్లడి కానుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు 61.70% పోలింగ్ జరిగింది. 6…
ఏపీ సీఎం జగన్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. తిరుపతి పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీగా ఉండగా ఓ అంగవైకల్యం ఉన్న వ్యక్తి ఆయన్ను కలిసేందుకు వచ్చాడు. 2019లో ఓ రోడ్డుప్రమాదంలో అంగవైకల్యం చెందిన మహేష్ అనే వ్యక్తి సీఎం జగన్‌కు తన గోడు వెల్లిబుచ్చడానికి వచ్చాడు. ఈ మేరకు ఓ అర్జీని సమర్పించాలని మహేష్ భావించాడు. కానీ సెక్యూరిటీ కారణంగా మహేష్ తన అర్జీని సీఎం జగన్‌కు ఇవ్వలేకపోయాడు. అయితే తిరుపతిలో పలు కంపెనీలకు ప్రారంభోత్సవాలు…
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిని కూల్చడం బలహీనవర్గాలపై దాడేనని ఆరోపించారు. ఈ అంశంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జగన్ అవినీతిని ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అసలు జగన్‌కు అయ్యన్న కుటుంబం చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడి కుటుంబం సొంత భూములను ప్రభుత్వాలకు దానం చేసి…