నేనైతే ముందుగానే వరద అంచనా వేసి ఉండే వాడిని అంటూ చంద్రబాబు అనటం మిలీనియం జోక్ అంటూ సెటైర్లు వేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అప్పట్లో తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ ఇంత పెద్ద విపత్తు వచ్చినా గోదావరి జిల్లాలో ప్రాణ నష్టం జరగలేదన్న ఆయన.. హ్యాంగర్ వేసి చంద్రబాబును వరద నుంచి కాపాడాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు.. అయినా ఫలితం లేదన్నారు.. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. చరిత్రలో ఎప్పుడూ రానంతగా వరదలు వచ్చాయి.. ప్రతి విషయాన్ని రాజకీయం కోసం వాడుకునే వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు.. ఏరియల్ సర్వే పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.. జగన్ గతంలో చంద్రబాబు చేసినట్లు హెలికాప్టర్‌లో విహార యాత్రలు చేయటం లేదన్నారు. చంద్రబాబును చూసి వానదేవుడూ పారిపోతాడని ఎద్దేవా చేసిన ఆయన.. పిల్లలకు పాలు లేవు అంటున్నారు… పాపం లోకేష్ ఏడుస్తున్నట్టు ఉన్నాడు పాలు లేవని అంటూ సెటైర్లు వేశారు..
Read Also:Parliament monsoon session 2022: తొలిరోజే సభకు అంతరాయం.. రాజ్యసభ రేపటికి వాయిదా
ప్రజాగ్రహ వరదలో చంద్రబాబు ఎప్పుడో కొట్టుకు పోయాడని వ్యాఖ్యానించారు మంత్రి వేణుగోపాల్.. వరద ప్రభావి ప్రాంతాల్లో యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టాం.. 256 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం, కోటి 64 లక్షల ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశాం, చింతూరులో 10 వేల మందికి భోజనం వండించి వరద బాధితులను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.. టీడీపీ నాయకులు ఎక్కడా వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించిన ఆయన.. ప్రభుత్వం సూక్ష్మంగా ఆలోచించి అన్ని చర్యలు తీసుకుంటున్నా చంద్రబాబుకు కనిపించటం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాగా, గోదావరి వరదలనపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. సీనియర్ అధికారులు, కలెక్టర్లు భుజాలమీద ఈ బాధ్యత ఉందని.. వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లు మిగిలి పోకుండా రూ.2వేల రూపాయల సహాయం అందివ్వాలని ఆదేశించారు.. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్… ఈ రేషన్ అంతా సిద్ధంగా ఉందని.. వదర బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలని స్పష్టం చేసిన విషయం విదితమే.