★ నేడు విజయనగరం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గంలో రోడ్‌షోలు, సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు ★ ఏలూరు జిల్లా: నేడు పోలవరం రానున్న సీడబ్ల్యూసీ నిపుణుల బృందం.. నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో పనులను పరిశీలించనున్న బృందం ★ నేడు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ★ నేడు బాసరకు వెళ్లనున్న టీబీజేపీ చీఫ్ బండి సంజయ్.. ట్రిపుల్…
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి గురువారం రాత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 24వ వార్డులో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తనకు పింఛన్ రావడం లేదని ఎమ్మెల్యే ద్వారంపూడిని ప్రశ్నించాడు. దీంతో ద్వారంపూడి సదరు వ్యక్తి ఆధార్ కార్డును పరిశీలించారు. ఆధార్ కార్డు ప్రకారం అర్హత లేదని చెప్పడంతో సదరు వ్యక్తి పదే పదే పింఛన్‌పై ఎమ్మెల్యేను…
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గానికి చెందిన 20 మంది కార్పొరేటర్లు ఈ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశమైన తర్వాత కౌన్సిల్ మీట్‌కు వెళ్లకూడదని కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదని మేయర్ బీవై రామయ్యపై కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం జరిగిన కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ వర్గం కార్పొరేటర్లు…
ఏపీ సీఎం జగన్ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల దావోస్ టూర్ వెళ్లిన ఆయన త్వరలో పారిస్ వెళ్లబోతున్నారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సీఎం జగన్ పారిస్ పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 28న పారిస్ వెళ్లనున్నారు. పారిస్‌లోని ఓ ప్రసిద్ధ బిజినెస్ స్కూల్లో సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఆర్థిక శాస్త్రం చదువుతోంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డిగ్రీ…
విద్యాశాఖపై తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా పదో తరగతి ఫలితాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువ రావడాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదన్నారు. నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి నెలలోజుల్లోనే మళ్ళీ పరీక్షలు పెట్టి వారిని కూడా రెగ్యులర్‌గానే పరిగణిస్తామని పేర్కొన్నారు. పదో తరగతిలో పాసైన వారికి…
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయగలరా అంటూ సీఎం జగన్‌ను లోకేష్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ‘ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ2 సెలవిచ్చారు. స్పెషల్ స్టేటస్ సాధిస్తారని ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. ప్రత్యేక…
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం కొంతకాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తుండగా.. ప్రొబేషన్ డిక్లరేషన్‌పై సీఎం జగన్ తాజాగా సంతకం చేశారు. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల కానుంది. జిల్లాల కలెక్టర్లు ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేయనున్నారు. జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పేస్కేల్ అమలు కానుంది. లక్షా 17 వేల మంది ఉద్యోగులు కొత్త పేస్కేలు కిందకు రానున్నారు. ఆగస్టు…
ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కోనసీమ జిల్లాలో చెలరేగిన హింసను ముందస్తుగా గుర్తించకపోవడంతో అక్కడ ఎస్పీగా పనిచేస్తున్న ఎస్పీ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయన్ను మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్‌గా నియమించారు. కోనసీమ కొత్త ఎస్పీగా సుధీర్‌కుమార్ రెడ్డిని నియమించింది. అటు విజయవాడ శాంతి భద్రతల డీసీపీగా విశాల్ గున్నీని ప్రభుత్వం నియమించింది. కృష్ణా జిల్లా ఎస్పీగా జాషువా, కర్నూలు ఎస్పీగా సిద్ధార్ధ్…
జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ స్ఫూర్తి.. చంద్రబాబు భరోసా పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు.. అయితే, చంద్రబాబు టూర్‌పై సెటైర్లు వేశారు మంత్రి జోగి రమేష్.. చంద్రబాబు జిల్లాల పర్యటనకు ‘ఎన్టీఆర్ స్ఫూర్తి… చంద్రబాబు భరోసా’ అని పేరు పెట్టారు.. ఇది బాగలేదు.. దానిని ‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు.. ప్రజలకు కుచ్చుటోపీ’ అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.. నెల్లూరు జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సమావేశంలో జోకర్ లాగా కనిపించారు.. చంద్రబాబు…
నాణ్యమైన విద్య దిశగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ మరో ముందడుగు వేసింది.. ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధంచేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.. అందులో భాగంగా అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం చేసుకుంది ఏపీ సర్కార్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందంపై ఏపీ ప్రభుత్వం, బైజూస్ ప్రతినిధులు సంతకాలు చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయం వేదికగా విద్యాశాఖ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం…