పోలవరంపై చర్చకు తాము సిద్ధం.. నీ బాస్ చంద్రబాబు నాయుడుని అసెంబ్లీకి పంపు అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు సవాల్ విసిరారు మంత్రి అంబటి రాంబాబు.. గోదావరి నదికి ఉధృతంగా వరదలు ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో రాలేదన్న ఆయన.. జులై నెలలో ఈ స్థాయిలో వరదలు రాలేదు. పునరావాసం విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం.. గతంలో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ఇద్దరు కలెక్టర్లు చేసే పనిని.. ఇప్పుడు ఆరుగురు కలెక్టర్లు చేశారని.. గ్రామ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున సహయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని.. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా సహాయక చర్యలు చేపట్టాం… భారీ ఎత్తున వరద వచ్చినా అవాంఛనీయ సంఘటనలు జరగ్గకుండా కరకట్టలు తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు.. వరద ప్రాంతాలకెళ్లి సీఎం జగన్ ఫొటోలు దిగికపోయినా.. అనుక్షణం మానిటర్ చేస్తూనే ఉన్నారు.. 28 లక్షల క్యూసెక్కులకు అనుగుణంగా కాఫర్ డ్యాం నిర్మాణం జరిగిందని.. వరద ఉధృతి చూసి 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా కాఫర్ డ్యాం ఎత్తు పెంచామని వెల్లడించారు..
Read Also: Business Updates: స్టాక్ మార్కెట్ల బిజినెస్ అప్‌డేట్లు.. కంపెనీల త్రైమాసిక ఫలితాలు..
ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకున్నా.. దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు.. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే చంద్రబాబుకి అధికారం వస్తుందనేది పిచ్చి ఆలోచన అని హెచ్చరించిన ఆయన… వరదలు వచ్చి ఇబ్బంది పడుతోంటే 21వ తేదీల్లో చంద్రబాబు ఎందుకెళ్తున్నారు..? వరద రాజకీయం చేయడానికి చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారా..? 50 నిమిషాల సేపు దేవినేని ఉమ ప్రెస్ మీట్ పెట్టారు.. ఏం మాట్లాడారోనని చూశా.. తలనొప్పి వచ్చింది.. గడ్డి పీకుతున్నారా..? అంటూ దేవినేని ఉమ ఏదేదో మాట్లాడారు.. పీకున్నది చాలదా..? దేవినేని ఉమను.. చంద్రబాబును పీకారు కాబట్టే.. అక్కడ ఉన్నారు అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.. దేవినేని ఉమ పెద్ద ఇగోయిస్టిక్ పర్సన్.. అన్నీ తనకే తెలుసంటారని ఎద్దేవా చేసిన ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు పోలవరం గురించి ఏనాడైనా ఆలోచన చేశారా..? అని ప్రశ్నించారు.. వైఎస్ శంకుస్థాపన చేస్తే… ఇప్పుడొచ్చి చంద్రబాబు, దేనినేని ఉమ వాడేసుకుంటున్నారని.. 2018లో పోలవరం పూర్తి చేస్తానని దేవినేని ఉమ చెప్పారు.. ఎందుకు పూర్తి చేయలేదు..? అని నిలదీశారు..
మా మీద నీకెందుకు కుళ్లు..? అవును నేను ఆంబోతునే.. నువ్వు ఆవువా..? గెదేవా..? లేక సీఎం కేసీఆర్ చెప్పినట్టు అటు ఇటు కానివాడివా..? అంటూ ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు.. పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం.. నీ బాస్ (చంద్రబాబు)ను అసెంబ్లీకి పంపించు అంటూ దేవినేని ఉమకు సవాల్ విసిరారు.. టీడీపీ నిర్వాకం వల్ల ఢయాఫ్రమ్ వాల్ దెబ్బతింది.. దీనిపై మేం చర్చకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టొచ్చా..? అని నిలదీశారు. దేవినేని ఉమ తన అహంభావాన్ని తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు.. నాకు తెలియకపోయినా.. తెలుసుకుని పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం.. కాఫర్ డ్యాం వల్ల పెద్ద అగాధం ఏర్పడింది.. దమ్ముంటే శాసన సభకు రండి.. పోలవరంపై చర్చకు సిద్ధం.. అసెంబ్లీకి రాకుంటే ఎక్కడికి రావాలో చెప్పాలి.. అంతే కానీ తాడేపల్లికో… పోలవరం గట్టు మీదకో కాదు… దేవినేని ఉమ లాంటి అతి తెలివి ఉన్న వాళ్ల వంటి వల్లే పోలవరం ఢయా ఫ్రమ్ వాల్ దెబ్బతిందని మండిపడ్డారు.. అన్ని పార్టీలు కట్టకట్టుకుని వచ్చనా జగన్ ఎదుర్కొగలరు అని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు..