Polavaram Project Upper Cofferdam: ఇటీవల గోదావరి నదికి అనూహ్య స్థాయిలో వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. దిగువ కాఫర్ డ్యాంపైకి నీరు ఎగదన్నింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో ప్రధాన జలాశయం నిర్మించాల్సిన ప్రదేశానికి ఎగువన నిర్మించిన కాఫర్ డ్యామ్‌ను ఎత్తును పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు 1 మీటరు పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూలై15న ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచే పనులు ప్రారంభించారు. ఈ మేరకు రెండున్నర కిలోమీటర్ల పొడవున మట్టి కట్ట ఎత్తును అధికారులు ఓ మీటరు పెంచారు. ఈ పనులను రెండు రోజుల్లోనే పూర్తి చేశారు.
Read Also: Kodali Nani: ఇతర రాష్ట్రాలలో రోడ్లపై గోతుల్లేవా? లేవని నిరూపించగలవా పవన్?
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం 2.5 కి.మీ పొడవునా ఒక మీటరు ఎత్తు, 2 మీటర్ల వెడల్పు పెంచే పనులు జూలై 15న ప్రారంభమయ్యాయి. 12 వేల క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ చేసి ఇంజినీరింగ్ అధికారులు పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచారు. భారీ వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు చేపట్టారు. జూలై 17 నాటికి 1మీ ఎత్తు పెంచే పనుల్ని నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి చేసింది.