రాజకీయాలకు తాను దూరంగా ఉన్నా తనకు ఇంకా అనుచర వర్గం ఉందని గల్లా అరుణకుమారి వెల్లడించారు. అయితే వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చానని.. వాళ్లకు ఎక్కడ బాగుంటే అక్కడ ఉండాలని చెప్పానని తెలిపారు.
తిరుపతి పర్యటనలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీసీఎల్ గ్రూప్‌కు చెందిన ప్యానెల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీ లిమిటెడ్ (POTPL), డిక్సాన్ టెక్నాలజీస్, ఫాక్స్ లింక్, సన్నీ ఆప్టో టెక్ కంపెనీలకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. టీసీఎల్ కంపెనీ తిరుపతిలో టీవీ ప్యానెళ్లను తయారుచేయనుంది. రూ.1230 కోట్లతో టీసీఎల్ గ్రూప్ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 3,174 మందికి ఉపాధి కలగనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ట్రయల్…
ఏపీలో సినిమా టికెట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ద్వారా ప్రభుత్వమే టిక్కెట్లను విక్రయించనుంది. దీంతో బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తి పలకనుంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఆన్లైన్లో టికెట్లు లభించనున్నాయి. ఈ మేరకు ఏపీఎఫ్డీసీ పోర్టల్ యువర్ స్క్రీన్స్ ద్వారా ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువర్ స్క్రీన్స్ పోర్టల్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ప్రభుత్వం తెచ్చిన ఆన్లైన్ విధానంతో…
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణమస్తు కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈ కార్యక్రమం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. కల్యాణమస్తు కార్యక్రమాన్ని ఆగస్టు 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఆగస్టు 7న ఉదయం 8:07 గంటల నుంచి 8:17 గంటల మధ్య 26 జిల్లాల్లో కల్యాణమస్తు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సామూహిక వివాహ మహోత్సవంలో వధూవరులు ఒక్కటయ్యేందుకు జూలై 1 నుంచి 20 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో…
రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది.
అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను 1998 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా తమ పాతికేళ్ల కలను నెరవేర్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం జగన్ పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి జగన్ వద్ద…
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఏటా 120 కోట్ల ఆదాయం వచ్చే ఈ పుణ్య క్షేత్రంలో 238 మంది పని చేస్తున్నారు. ఆలయంలో ఐదేళ్లు పైబడి ఒకేచోట తిష్ఠవేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని అనుకుంటున్నారు. ఆ జాబితాలో 80 మందిని గుర్తించారట. నెలాఖరులోగా ఆ ప్రక్రియ కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ ఏళ్ల తరబడి అన్నవరం ఆలయంలోనే పాతుకుపోయిన వారిలో గుబులు రేగుతోందట. బదిలీ…
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మే 6 నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇంటర్ పరీక్షలకు దాదాపు 4,64,756 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే టెన్త్ ఫలితాలు విడుదల కాగా.. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా కొన్ని రోజులుగా ఫలితాల విడుదల…
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై మంగళవారం మధ్యాహ్నం అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన పనులు ఎక్కడా కూడా పెండింగ్‌లో ఉండకూడదని.. వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ హితవు పలికారు. గుంతలు లేకుండా…
శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో ప్రజలపై దాడి చేసిన ఎలుగుబంటి చనిపోయింది. తీవ్రమైన గాయాలతో విశాఖకు తరలిస్తుండగా ఎలుగుబంటి చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఉద్ధానంలో సోమవారం తెల్లవారుజామున పొలం పనుల కోసం వెళ్లిన కొందరిపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. కొందరు ఈ దాడి నుంచి తప్పించుకోగా ఏడుగురు వ్యక్తులు ఎలుగుబంటి దాడిలో గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఎలుగుబంటి దాడిలో మనుషులే కాకుండా మూగజీవాలు కూడా గాయపడ్డాయి. సుమారు 10 ఆవులు…