సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులు సరికాదని డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ సందర్భంగా గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకుని సీఐడీ పోలీసులు వేధించారని లేఖలో ఆరోపించారు. అర్ధరాత్రి గోడలు దూకి తలుపులు పగలగొట్టి నోటీసుల పేరుతో వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్న సమయంలో అక్రమంగా ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేశారన్నారు. అక్రమంగా కస్టడీలోకి తీసుకుని సీఐడీ…
విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమాన్ని జనసేన పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా తాము కృషి…
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జూలై 4న ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు. ఉదయం 10:10 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు భీమవరంలోని సభా ప్రాంగణానికి ప్రధాని మోదీ, సీఎం జగన్ చేరుకోనున్నారు. ఇరువురు నేతలు స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి…
> హైదరాబాద్: ఈరోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ.. హాజరుకానున్న ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. > హైదరాబాద్: ఈరోజు రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్న ప్రధాని మోదీ.. పరేడ్ గ్రౌండ్స్ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లనున్న మోదీ.. ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు రాజ్‌భవన్ రోడ్డు మూసివేత >…
ఏపీలో ఈనెల 4 నుంచి 12 వరకు జరగనున్న ఈఏపీసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి శ్యామలరావు వెల్లడించారు. జూలై 4 నుండి 8 వరకు ఇంజినీరింగ్ పరీక్ష లు జరుగుతాయని.. జూలై 11,12 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష జరుగుతుందని వివరించారు. మొత్తం 122 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని శ్యామలరావు వివరించారు. రెండు సెంటర్లు తెలంగాణలో ఉంటాయని తెలిపారు. ఈఏపీసెట్ పరీక్షల కోసం మొత్తం 3 లక్షల 84…
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తలకు క్రియాశీలక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన వీర మహిళల శిక్షణ తరగతుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుందని.. బీజేపీ ఇద్దరు ఎంపీలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఇద్దరితో ప్రారంభమైన టీడీపీ ఇప్పుడు ఎవరి అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగలిగే స్థాయికి వచ్చిందన్నారు. మహిళలు ముందుండి నడిపించకుంటే సమాజంలో మార్పు రాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.…
జూలై 4న భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమానికి జనసేన పార్టీని ఆహ్వానించలేదని వస్తున్న విమర్శలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమానికి ప్రత్యేకంగా జనసేనను ఆహ్వానించాల్సిన అవసరం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. బీజేపీ-జనసేన ఒక్కటేనని.. పవన్ తమ ఇంట్లో అతిథిలాంటి వాడని విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భీమవరంలో అల్లూరి జయంతి సభను రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. మోదీ సభకు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 20…
అక్కడ గ్రూపు తగాదాలకు అంతం లేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టినా పరిస్థితి మారలేదు. స్థానిక లీడర్ల నుండి, జిల్లా మంత్రుల వరకు అందరితో ఆమెకు తలనొప్పులే కొనసాగుతున్నాయి. లేటెస్టుగా జరుగుతున్న ప్లీనరీలు పరిస్థితిని మరింత స్పష్టం చేశాయి. ప్లీనరీల సాక్షిగా ఏకాకిగా మారారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. అయినా సొంత జిల్లాలో మాత్రం చిక్కులు తప్పటం లేదు. తనను అణగదొక్కడానికి చూస్తున్నారని, ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న…