Half Day Schools: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. ఒంటిపూట బడులు వచ్చేశాయ్.. ఎప్పటి నుంచంటే..
- హాఫ్ డే స్కూల్స్ షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ..
- మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు..
- ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు (Half-Day Schools) నిర్వహించనున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం వడ్డించిన తర్వాత విద్యార్థులను ఇంటికి పంపిస్తారు.
Also Read:Urea: రైతుల యూరియా కష్టాలకు చెక్.. ఆ జిల్లాలకు భారీగా బస్తాలు..
Also Read
టెన్త్ ఎగ్జామ్స్ జరిగే స్కూళ్లలో షెడ్యూల్ మారుతుంది. అక్కడ మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షల దృష్ట్యా యధావిధిగా ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. తిరిగి 2026-27 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?