రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ బహిరంగంగానే ప్రకటించింది. అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ మాత్రం తమ వైఖరిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ వైఖరిని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తమకు ఎర్రకోట మీద జెండా ఎగరేయాలని, ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉన్నాయని తెలిపారు.…
డేటా చౌర్యంపై అమరావతిలోని సచివాలయంలో హౌస్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సాధికార సర్వే ద్వారా వచ్చిన సమాచారం సేవా మిత్ర అనే ప్రైవేట్ సంస్థకి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించారని.. పార్టీ కార్యకర్తలకు ఇచ్చి తమకు అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగించాలని చూశారని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. డేటా చౌర్యం వెనుక చాలా పెద్దవాళ్ళ సహకారం…
కొద్ది రోజులుగా బంగారు, వెండి ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపించాయి. రోజు రోజుకు పెరుగుతూ ప్రజలకు ఝలక్ ఇచ్చాయి. అయితే.. నేడు బంగారం, వెండ ధరలు కొద్దిగా తగ్గి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పినట్టైంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు నేడు తగ్గాయి. దీంతో పసిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు కాస్త ఊరట నిచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్.. తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..…
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు సంబంధించి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీని విశాఖలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు 14 నుంచి 31 వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అగ్నివీరుల ఎంపికలు ఉంటాయని ప్రకటించారు. ఏపీలోని 13 జిల్లాలు, యానాం కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, పార్వతీపురం మన్యం,…
కాకినాడ జిల్లాలో మంగళవారం జరిగిన వైసీపీ ప్లీనరీలో రోడ్డు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు తాము పెట్టిన చిన్న బచ్చా గాళ్లు అని.. వాళ్లు తమ మీద పెత్తనం చెలాయిస్తున్నారని చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. వాలంటీర్లను మనమే పెట్టామని.. మీకు నచ్చకపోతే తీసేయండి అంటూ కార్యకర్తలకు సూచించారు. వార్డు సచివాలయాలను కార్యకర్తలు కంట్రోల్లోకి తీసుకుని నడిపించాలి.. మిమ్మల్ని ఎవరూ వద్దని…
నాలుగేళ్ల క్రితం నిర్వహించిన 2018 ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్వ్యూలో ఎంపికైన 165 మంది అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ మంగళవారం నాడు వెల్లడించింది. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 167 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా 165 పోస్టులను భర్తీ చేసింది. మరో రెండు స్థానాలను స్పోర్ట్స్ కోటా కోసం రిజర్వ్ చేసింది. Read Also: Driverless Car: ఐఐటీ హైదరాబాద్…
'ఈరోజుల్లో మనుషుల మధ్య అనుబంధాలు ఎలా ఉన్నాయి?' అనే ప్రశ్నకు సమాధానమిస్తూ సెల్ఫోన్లు రిలేషన్‌షిప్‌లను పాడుచేస్తున్నాయని, వ్యక్తుల విలువైన సమయాలను నాశనం చేస్తున్నాయని శకుంతలా పట్నాయక్ ఆవేదన వెలిబుచ్చారు.
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి జల జగడం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారి ఈఎన్సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై లేఖలో అభ్యంతరం తెలిపారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని ఈ లేఖలో…