బార్ల మద్యం పాలసీ వ్యవహారం హైకోర్టుకు చేరింది.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది… అయితే, పిటిషనర్ల తరపున వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. సంబంధిత జీవోపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.. ఇక, రేపటి నుంచి వేలం ప్రారంభమవుతుందని, నాన్ రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డిపాజిట్ తిరిగి ఇవ్వబోమని ప్రభుత్వం చెబుతోందని, దీనివల్ల నష్టపోతారని ధర్మాసనానికి వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం..మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదే సమయంలో.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.. కాగా, ఏపీలో బార్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బార్ల మద్యం పాలసీపై స్టే విధించాలని కొందరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు బార్ల మద్యం పాలసీపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
Read Also: Tollywood: షూటింగ్స్ బంద్.. ఎవరికి కష్టం? ఎంత నష్టం?