Work From Home: వంట గ్యాస్ ఎఫెక్ట్.. ఉద్యోగస్థులకు వర్క్ ఫ్రం హోం ఆఫర్ చేసిన టాప్ టెక్ దిగ్గజం..
- వంట గ్యాస్ కష్టాలు ఐటీ ఉద్యోగులకు కూడా..
- క్యాంటీన్ మూసేయడంతో వర్క్ ఫ్రం హోమ్ ఆఫర్ చేసిన టెక్ కంపెనీ..
- ఇన్పోసిస్‌లో కూడా ఇదే పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంట గ్యాస్ కొరత ప్రభావం ఇప్పుడు ఐటీ కంపెనీలపై కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ సంస్థ HCLTech చెన్నై కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మార్చి 12, 13 తేదీలలో వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. ఈ విషయాన్ని సంస్థలోని ఇద్దరు సీనియర్ అధికారులు వెల్లడించారు. చెన్నై కార్యాలయంలోని క్యాంటీన్లలో పనిచేసే వారు వంట గ్యాస్ కొరత కారణంగా సేవలు అందించలేకపోతున్నారు. దీంతో ఉద్యోగులకు ఆహార సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల పాటు ఇంటి నుంచే పని చేయాలని కంపెనీ అనుమతించింది.
ప్రభుత్వం భరోసా ఇచ్చినా కూడా వంట గ్యాస్ కొరత కొనసాగుతుండటంతో దేశంలోని అనేక రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై చేపట్టిన చర్యల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. దాని ప్రభావం భారత కంపెనీలపైనా క్రమంగా కనిపిస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.60 పెంచగా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.144 పెంచారు. దీంతో హోటళ్లు, క్యాంటీన్ల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ఈ అంశంపై అధికారికంగా స్పందించాలంటూ HCLTech సంస్థకు ఈమెయిల్ పంపినప్పటికీ ఇంకా సమాధానం రాలేదని సమాచారం.
Also Read
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Also Read:Half Day Schools: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. ఒంటిపూట బడులు వచ్చేశాయ్.. ఎప్పటి నుంచంటే..
ఇదిలా ఉండగా.. మరో ఐటీ దిగ్గజం Infosys కూడా తమ ఉద్యోగులకు సూచనలు జారీ చేసింది. బెంగళూరు, చెన్నై కార్యాలయాల్లోని క్యాంటీన్లలో సాధారణంగా ఉండే ఆహార పదార్థాలు తగ్గించనున్నట్లు తెలిపింది. కమర్షియల్ వంట గ్యాస్ అందుబాటుపై అనిశ్చితి ఉన్నందున కొన్ని ఫుడ్ కౌంటర్లను తాత్కాలికంగా మూసివేసింది. ఉద్యోగులు వీలైనంత వరకు ఇంటి నుంచి ఆహారం తీసుకురావాలని సూచించింది. గత ఏడాది చివరి నాటికి Infosys సంస్థలో సుమారు 3.37 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. HCLTech సంస్థలో 2.26 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది భారత్‌లోనే పనిచేస్తున్నారు.
Also Read:Ugadi 2026: పరాభవ నామ సంవత్సరంలో మీ ఆదాయం ఎంత.? ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.?
మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంతో వ్యాపార సంబంధాలు ఉన్న కంపెనీలు కొత్త సీనియర్ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయని గ్లోబల్ రిక్రూట్‌మెంట్ సంస్థలు చెబుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన ఈ ఘర్షణలో ఆ ప్రాంతంలోని అనేక దేశాలు కూడా చేరాయి. దీనితో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఈ పరిస్థితుల ప్రభావం భారత్‌పై కూడా ఉండే అవకాశం ఉంది. గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు అయిన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్ వంటి దేశాల్లో 90 లక్షలకు పైగా భారతీయులు నివసిస్తూ పనిచేస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత కంపెనీలు తమ ఉద్యోగుల స్థానాలను గుర్తించి, భద్రతా చర్యలపై సూచనలు ఇస్తూ ప్రత్యేక నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. అయితే ఈ పరిస్థితుల అసలు ప్రభావం రాబోయే నెలల్లో మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!