జగనన్న పాలవెల్లువ పథకంలో మరో విప్లవాత్మక అడుగు పడుతోంది.. పూర్తి స్థాయి నిర్వహణలో ఉన్న సమయంలో దిగ్గజ సంస్థ అమూల్ కి గట్టి పోటీ ఇచ్చిన చిత్తూరు డెయిరీ.. మూతబడితే, దానికి జీవం పోసి పాడి రైతులకు అండగా నిలుస్తూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆనం రాంనారాయణ రెడ్డి సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి.. గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు జయకుమార్ రెడ్డి.
బాల్య వివాహాల నిరోధంలో కళ్యాణమస్తు, షాదీతోఫా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెనలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.. అయితే, ఈ పథకాలు పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా టెన్త్ చదవాల్సిందేనని తేల్చేశారు సీఎం వైఎస్ జగన్.. చిల్డ్రన్ హోమ్స్‌లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత.. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు, లోకేష్ కు లేదన్న ఆమె.. ఎన్టీఆర్ కుమార్తెగా నారా భువనేశ్వరి అంటే మాకు గౌరవం ఉంది.. ఆమెను కించపరిచే వ్యాఖ్యలు వైసీపీ నేతలు ఎవరూ చేయలేదన్నారు
చిత్తూరు డైయిరీని అమూల్ కు ధారాదత్తం చేయడం సరికాదంటూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. చిత్తూరు డెయిరీని అమూల్ కు అప్పగించడమంటే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.. ఇక్కడి ప్రజాసంపద, సహకార డైయిరీల వేలకోట్ల విలువైన ఆస్తులను అమూల్ కు కట్టబెట్టడతారా..? అని ప్రశ్నించారు.